కరోనా వైరస్ సమయంలో మనదేశంలొని ఆరు ప్రముఖ నగరాల్లో బాగా అమ్ముడుపోయినవేంటో తెలుసా ? చాలామంది నిత్యావసరాలని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజంకాదు. ఎందుకంటే మార్చి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడి లాక్ డౌన్ ప్రకటించేంత వరకు చాలామంది జనాలు నిత్యావసరాల విషయంలో పెద్దగా ఆందోళన పడలేదన్నది వాస్తవం. కాకపోతే అప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి మనదేశంలో మొదలైనా  జనాల్లో టెన్షన్ మాత్రం మొదలవ్వలేదు.

 

అందుకనే మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు ఆరు ప్రముఖ నగరాలు బెంగుళూరు, పూనే, చెన్నై, జైపూర్, ముంబాయ్, హైదరాబాద్ లో జనాలు ఎక్కువగా ఆర్డర్ చేసిన వాటిపై ప్రముఖ స్టార్టప్ కంపెనీ డుంజో ఓ నివేదికను విడుదల చేసింది. మార్కెట్లో అవసరాలను తీర్చే స్విగ్గీ, పాండా,  ఉబెర్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తో పాటు నిత్యావసరాలను కూడా డుంజో వినియోగదారుల ఇళ్ళకు చేరవేస్తుంటుంది లేండి. హైదరాబాద్ లో కూడా డుంజో ఉన్నా ముంబాయ్, చెన్నై, జైపూర్, బెంగుళూరు లాంటి నగరాల్లో బాగా పాపులరనే చెప్పాలి.

 

తమకు వచ్చిన ఆర్డర్ల ప్రకారం మార్చి నెలలో జనాలు ఎక్కువగా ఏ వస్తువులను ఆన్ లైన్లో ఆర్డర్ చేశారనే విషయాన్ని డుంజో బయటపెట్టింది.  ఈ నివేదిక ప్రకారం జైపూర్, చెన్నై జనాలు ఎక్కువగా హ్యాండ్ వాష్ ను ఆర్డర్ చేశారట. అంటే వ్యక్తిగత శుభ్రత విషయంలో పై రెండు నగరాల్లోని జనాల్లో మంచి అవగాహన ఉందని అర్ధమవుతోంది. పైగా రెండో వారానికే కరోనా వైరస్ ప్రభావం మనదేశంలో కూడా ఎక్కువైపోయింది. దానికితోడు డాక్టర్లు, ప్రభుత్వాలు అప్పటికే వ్యక్తిగత శుభ్రత విషయంలో జోరుగా ప్రకటనలు చేస్తోంది. అందుకనే హ్యండ్ వాష్ ఎక్కువగా కొనుగోలు చేశారట.

 

సరే వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టేస్తే పూణే, బెంగుళులో ఎక్కువమంది ప్రెగ్నెన్సీ కిట్ల కోసం ఆర్డర్లు చేశారట. వీళ్ళ విషయం ఇలాగుంటే ముంబాయ్ వాసులు ఇచ్చిన ఆర్డర్లలో మొదటిస్ధానం కండోములదేనట.  సరే మన హైదరాబాద్ జనాలు కూడా తక్కువేమీ తినలేదు లేండి. వాళ్ళకు వచ్చిన ఆర్డర్లలో ఎక్కువగా ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా ఆర్డర్ చేశారట. ముంబాయ్, హైదరాబాద్ వాసుల ఆర్డర్ల విషయం నూటికి నూరుశాతం నిజమే అంటూ డుంజో బల్లగుద్ది మరీ చెబుతోంది కాబట్టి నిజమనే అనుకోవాలి. పైగా మార్చిలో కూడా లాక్ డౌన్ పీరియడ్ లోనే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని చెబుతోంది డుంజో.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పైన చెప్పిన ఏ నగంలో కూడా ఫుడ్ ఆర్డర్ కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవటం. అంటే ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేసుండరా అంటే చేసుంటారు. కానీ వాళ్ళ శాతం చాలా తక్కువనే చెప్పాలి. మామూలుగా అయితే ఏ నగరంలో ఆన్ లైన్లో ఆర్డర్ వచ్చినా మొదటిస్ధానం మాత్రం ఫుడ్ ఆర్డర్లే అయ్యుంటాయనటంలో సందేహం లేదు. మరి ఇపుడు మాత్రం ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేయలేదంటే కరోనా వైరస్ దెబ్బకే బయట ఫుడ్ కోసం ఎవరూ ఆర్డర్ చేయలేదనే సమాధానం వస్తోంది. ఎంతపని చేసింది కరోనా వైరస్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: