జనసేనాని అంతరంగం ఏంటో సొంత పార్టీ నాయకులకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా , ఏ సమస్య పై పోరాటం చేసినా, ఇప్పుడు దానిని మధ్యలోనే వదిలి పెట్టేస్తాడు అనే ముద్ర ఆయన మీద ఉంది. ఇది సొంత పార్టీ నాయకులు ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు ప్రజలు ఇలా ఎవరు ఆ ముద్ర వేసిన ఆ ముద్ర అయితే పడిపోయింది దానిని చేరిపేదుకు పవన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, అది మాత్రం వర్క్ ఔట్ అవ్వడం లేదు. ఏపీలో అధికార పార్టీ అనిపించుకోవాలని తహతహలాడుతున్న బిజెపి, జనసేనలకు జనాల్లో పెద్దగా బలం లేదనే విషయం బాగా తెలుసు. అందుకే కాస్తోకూస్తో ప్రజాబలం ఉన్న జనసేనాని మద్దతు గనుక తమకు ఉంటే, ఇక తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అనేది బిజెపి పెద్దలకు ఉన్న అభిప్రాయం. అందుకే రెండు పార్టీలు కలిసి పొత్తుపెట్టుకుని ముందుకు వెళ్తున్నాయి. 



కానీ ఇక్కడ కూడా పవన్ అదే విధంగా బిజెపి ని పట్టించుకోనట్టూ , బిజెపి కూడా పవన్ ను పట్టించుకోనట్టు, అసలు ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్లుగానే వారి పొత్తు కొనసాగుతోంది. దీంతో అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందా లేదా అనేది ఆ రెండు పార్టీల నాయకులకు సైతం అసలు అర్థం కావడం లేదు. ఇది ఇలా ఉండగా, పవన్ తో ప్రచారం చేయించేదుకు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పవన్ మాత్రం అయాం వెరీ సారీ అని చెప్పడంతో బిజెపి ఒంటరిగానే ఎన్నికల ప్రచారంలో దిగింది.ఇక ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు వస్తుండడంతో, పవన్ ఇప్పటికైనా, ప్రచారానికి దింపాలని బీజేపీ ప్లాన్ వేసుకుంది.


 అయితే కేసీఆర్ అంటే ఎప్పుడూ భయం భక్తులతో ఉండే పవన్, ఆయనను తిట్టిపోసేందుకు ముందుకు వస్తారా అనేది ఇప్పుడు బీజేపీ నేతలకు అనుమానం పట్టుకుంది. కేసీఆర్ ను తిట్టకుండా పొగుడుతూ వస్తుండడం మాత్రం బీజేపీకి మండిపోతోంది. దీంతో అసలు పవన్ మనస్తత్వం ఏమిటో ఒక పట్టాన బిజెపి కి అర్థం కావడం లేదు. ఇక పవన్ బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళినా, పెద్దగా ఉపయోగం ఉండదని, కాకపోతే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తమకు ఉపయోగపడుతుందని, ఆర్థికంగా బిజెపి ఆదుకుంటుందని పవన్పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ వైఖరి ఏమిటో పవన్ కు , పవన్ వైఖరి ఏమిటో బీజేపీకి లేకపోయినా, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం బ్రహ్మాండంగా సాగిపోతుంది. ఏపీ లోనే ఇలా ఉంటే, ఇప్పుడు తెలంగాణలోనూ ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో, ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తాయా అనే అనుమానాలు ఇప్పుడు ఆ రెండు పార్టీల నాయకులతో పాటు ప్రజలలోనూ కలుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: