జనాలు ఎవరూ ప్రశాంతంగా ఉండకుండా ఒక దాని తర్వాత మరొకటి అన్నట్లుగా కొత్త కొత్త వింత వింత జబ్బులు వచ్చి ప్రపంచం మీద పడుతున్నాయి. ఎవడు తయారుచేసిన క్రిమికీటకాలో తెలియదు కానీ, ప్రపంచాన్ని తినేస్తున్నాయి. చైనా లో పుట్టి ప్రపంచమంతా గూడుకట్టుకున్న ఆ కరోనా వైరస్ తో అంతా బిక్కచచ్చిపోయి ఉండిపోయారు. రోడ్లపైకి వచ్చేందుకు జడిసి పోయేవారు. రక్త సంబంధీకుల ను సైతం దూరం పెట్టుకుని ఈ వైరస్ భయంతో అందరినీ దూరం చేసుకున్నారు. మూతికి మాస్క్ పెట్టుకుని రోడ్లపైకి ఎప్పటికీ వెళ్లాల్సిన పరిస్థితి .
ఇష్టానుసారంగా మూతికి మాస్క్ పెట్టుకోకుండా, నా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతాను అంటే ఇప్పుడు అది పెద్ద నేరం. సమాజం కూడా పురుగును చూసినట్టు గా చూసే పరిస్థితి ఉంది. ఇదంతా ఆ
కరోనా వైరస్ పురుగు కారణంగానే. ఇప్పుడు ఆ పురుగు ఆప్ డేట్ అయిపోయింది. మరో సరికొత్త రూపంలోకి మారిపోయింది. ఇప్పుడిప్పుడే మాస్కలు తీసి గుంపులు గుంపులుగా రోడ్లోకి హాయిగా తిరిగేద్దామని చూస్తున్న జనాలకు మరో పిడుగులా
కరోనా వైరస్ స్ట్రెయిన్ అనే సరికొత్త రూపంలో వచ్చేసింది. ఇప్పుడు ఆ వైరస్ భయం జనాల్లో మరింతగా పెరిగిపోయింది. ఈ స్ట్రెయిన్ కంటే కరోనా వెయ్యి రెట్లు బెటర్ అన్నట్లుగా జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఈ కరోనా కాదు.. స్ట్రెయిన్ కాదు... నేను మరో అప్ డేట్ వెర్షన్ అంటూ ఇంకో వైరస్ జనాల మీదకు వచ్చి పడిపోయింది. ఎక్కడో దక్షిణాఫ్రికాలో పుట్టి బ్రిటన్ కు వచ్చి అన్ని దేశాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఓరి బాబోయ్ ఇదేం కలికాలం
రా బాబు. ప్రశాంతంగా జీవిస్తూ హాయిగా బతికేద్దాం అనుకుంటున్న జనాలను ఒకదాని తరువాత మరొకటి అన్నట్లుగా కొత్త కొత్త వింత వింత వైరస్ లు పుట్టుకొచ్చి చచ్చే చావు తీసుకొస్తున్నాయి. కలికాలం , యుగాంతం వంటి మాటలు ఎన్నో ఎన్నెన్నో ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజంగా ఆ కలి కాలం .. యుగాంతానికి సూచనలు ఇవేనా అన్నట్లుగా కనిపిస్తూ.. మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేసేస్తున్నాయి. ఈ మూడు రకాల వైరస్ లు కాదు... ముందు ముందు ఎన్నెన్నో రకాల వైరస్ చూడాల్సి వస్తుందో అన్న భయం రోజుకు పెరిగిపోతుంది.... ప్రతిక్షణం టెన్షన్ టెన్షన్ టెన్షన్.