దొరికితే కుమ్మేయడమే.. ఇదీ జగన్ ప్లాన్‌.. ఏంటీ కుమ్ముడు అనుకుంటున్నారా.. మన వాడుకలో కుమ్ముడు అంటే చాలా అర్థాలు వస్తాయి కానీ.. ఈ కుమ్ముడు మాత్రం భౌతిక దాడులకు సంబంధించిందే.. తెలుగుదేశం నేతలను ఏమాత్రం అవకాశం దొరకినా కుమ్మేయించాలన్నది జగన్ ప్లాన్‌ గా కనిపిస్తోంది. తెలుగు దేశం నేతలకు సంబంధించిన వరుస ఘటనలను పరిశీలిస్తే.. అవును నిజమే కదా అనిపిస్తుంది.. వైసీపీ అధికారంలోకి రాగానే.. ముందుగా పోలీసులు దెబ్బ రుచి చూసింది మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.


ఈయన్ను ఇప్పటికి విడతలు విడతలుగా అరెస్టు చేసి.. జైలు ముఖం చూపించారు. ఇక ఆ తర్వాతి వంతు ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి వచ్చింది. ఈఎస్‌ఐ మందుల స్కామ్‌ కేసులో ఛాన్స్‌ దొరికింది. అంతే.. కుమ్మేశారు. పాపం.. పైల్స్ తో బాధపడుతున్నాను మొర్రో అన్నా వినకుండా.. ఏకంగా శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకూ జీపులో తీసుకొచ్చారు. ఆ తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డారు అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత కోర్టుకు వెళ్తే తప్ప ఆయనకు ఉపశమనం కలగలేదు.


ఇక వీరికంటే ముందు నుంచి వైసీపీ సర్కారు పోలీసుల పవర్ అనుభవంలోకి వచ్చింది చింతమనేని ప్రభాకర్‌కు.. ఆయన్ను ఇప్పటికి ఎన్నిసార్లు అరెస్టు చేశారో.. ఎన్నిసార్లు జైల్లో పెట్టారో బహుశా ఆయనే చెప్పలేకపోవచ్చు. ఒకదాని వెంట మరొకటి కేసులు పెడుతూనే ఉన్నారు.. జైలుకు పంపుతూనే ఉన్నారు. ఆయన బయటకు వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ధూళిపాళ్ల నరేంద్రను డెయిరీ కేసులో అరెస్టు చేసి.. జైలు ముఖం చూపించారు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమా వంతు వచ్చేసింది.


కృష్ణా జిల్లాలో అక్రమంగా మైనింగ్ జరుగుతోంది అంటూ ఆయన అటవీ ప్రాంతానికి వెళ్తే.. అక్కడ వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అంతే.. దేవినేనిపై కేసు నమోదైంది.. ప్రస్తుతం ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. సో.. మొత్తం మీద.. టీడీపీ నేతలు దొరికితే మాత్రం కుమ్మకుండా వదిలేది లేదని జగన్ టీమ్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: