అయితే తెలుగులో కవులు, రచయితలు ఇంతకు ముందు ఒక అమ్మాయిని గానీ ఆమె అందాన్ని పొగడాలంటే చందమామా లాంటి చక్కని రూపం అని, చంద్రబింబం వెలుగులా మెరిసిపోతుందని అని రాసేవారు. చంద్రవంక లాంటి నడుము అని కీర్తించేవారు. ఇలా చంద్రుడి మీద పాటలు, మాటలు కీర్తనలు ఎన్నో ఎన్నెన్నో రాశారు. చందమామా అంటే అంత క్రేజీ మరి..
అయితే చంద్రయాన్ 3 సాప్ట్ ల్యాండింగ్ తర్వాత చందమామాపై అన్ని గుంతలు కనిపిస్తున్నాయి. చదునుగా ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు అలా ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు. ల్యాండర్ ల్యాండ్ అయిన చోటు నుంచి రోవర్ దిగి కిందకు వెళ్లిన ప్రాంతం కూడా గుంతలు పడి ఉన్నట్లు తెలిసింది. మరి ఇలాంటి గుంతలు ఎందుకున్నాయి. అసలు గుంతలు ఎలా పడ్డాయి. ఎందుకు పడ్డాయి. అసలు వాతావరణమే లేని ప్లేస్ లో గుంతలకు గల కారణం ఏమిటి? ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే చందమామ పైన ఉన్న ప్రగ్యాన్ రోవర్ తన పని చేయాల్సి ఉంది.
అయితే చందమామ ఉపరితలం గరుకుగా ఉండటంతో ఇప్పుడు అందరూ దాన్ని అమ్మాయితో పోల్చవద్దని అంటున్నారు. మొన్నటి వరకు చందమామా లాంటి ముఖం అంటే ఇప్పుడు గతుకులు ఉన్నాయని అంటారేమోనని భయపడుతున్నారు. కానీ చందమామా దూరం నుంచి చూసినంతా అందంగా మాత్రం లేడు. గతుకులు, గుంతలతో గట్టి నేలగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి కవులు, రచయితలు ఇప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకుని పాటలు , మాటలు రాస్తారో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి