ఏదైనా గ్రామం కానీ, రాష్ట్రం కానీ పక్కపక్కనే ఉంటే రవాణా సౌకర్యానికి ఇబ్బందులు ఉండవు. దీనివల్ల వ్యాపార వాణిజ్యాలు సులభంగా సాగుతాయి. అమెరికా, యూరప్ దేశాలకు ప్రయోజనం అదే. అక్కడ ఒకరికికొకరు అనుసంధానం ఉంటుంది. అలాగే అరబ్ దేశాలకు కూడా ఒకదాని తర్వాత మరొకటి వెళ్తూ ఉంటాయి.


మన దేశానికి వచ్చే సరికి మన చుట్టుపక్కల  దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తాం. తప్ప భారత్ కు ఎవరూ చేయరు. చైనా ఎగుమతిలో బాగానే ఉన్నా ఆ దేశానికి మనకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మన ఇరుగు పొరుగు దేశాలతో అదే మనకి పెద్ద సమస్య. కాబట్టి యూరప్ దేశాలతో అనుసంధానం కోసం ఒక రూట్ ను సిద్ధం చేస్తున్నారు. అది భారత ప్రధాని నరేంద్ర మోదీ కల. రాబోయే 20,30 ఏళ్లలో ఇది పూర్తైతే భారత రూపు రేఖలు మారనున్నాయి.


దీనిపై మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ భారత మధ్య ప్రాశ్చ్యం యూరప్ కారిడార్ రాబోయే కొన్ని శతాబ్దాల పాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతుంది అని వ్యాఖ్యానించారు.  ఈ కారిడార్ ఆలోచన భారత గడ్డపై పుట్టిందన్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తుంచుకుంటాయి అని అన్నారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్ రూట్ గురించి ప్రస్తావించారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనమిక్ కారిడార్ ను భారత్ ప్రతిపాదించిందని గుర్తు చేశారు.


దిల్లీలో జరిగిన జీ20 మండపం ఒక సెలబ్రిటీగా మారింది. అక్టోబరు 1న ఉదయం భారీ స్వచ్ఛతా ర్యాలీ నిర్వహిస్తున్నాం అని పేర్కొన్నారు. మనవాళ్లు ఇతర దేశాలకు ఓడల మీద వ్యాపారం చేయడం వల్లనే వాళ్లు ఇక్కడికి వచ్చారు. దాన్ని ఇప్పుడు మళ్లీ వెలికి తీసి అలాంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు ప్రధాని మోదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: