హిందూ పూజావిధానంలో దీపారాధనకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. నిత్యం పూజలు, పునస్కారాలు చేయని వారు సైతం.. రోజూ స్నానం చేయగానే దీపారాధన చేసుకుని దేవుని నమస్కారం పెట్టుకోవడం సర్వసాధారణం. అయితే ఈ దీపారాధన విషయంలో భక్తుల్లో ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి. 

దీపారాధన ఏ ఏ వస్తువుల్లో చేయాలి. ఎలాంటి నూనె ఉపయోగించాలి. ఏ సమయంలో చేయాలి అనే సందేహాలు భక్తులను కలుగుతుంటాయి. పంచ లోహాలు, వెండితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం మంచిది. మట్టి ప్రమిదల్లోనూ పూజ చేయవచ్చు. కానీ వాటిని నిత్యం వాడకూడదు. దీపారాధనకు ప్రాతః సమయం అనుకూలమైంది. లేదా సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి. 

ఇక ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం.. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే.. జ్ఞానసిద్ధి, మోక్ష ప్రాప్తి కలుగుతాయట. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సంపద, కీర్తి వృద్ధి చెందుతాయట. అందుకే దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్టమైనవి. 

ఇక దీపారాదనలో ఆముదము నెయ్యి ఉపయోగిస్తే దాంపత్య జీవతం సుఖ సంతోషాలతో సాగుతుందట. విప్ప నూనె, వేప నూనె లతో దీపారాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుందట. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదపు నూనె, కొబ్బరినూనెల మిశ్రమంతో 48 రోజుల పాతు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తే దైవానుగ్రహం కలిగి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట. 



మరింత సమాచారం తెలుసుకోండి: