అన్ని మాసాలలో కెల్లా అతి పవిత్రమైన మాసం కార్తీకమాసం.. పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. అటు హరికి, ఇటు హరుడికి, మరోపక్క వారిద్దరితనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసమిది.


కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది.


సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు.


సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం. ఈ కార్తీకమాసం లో అత్యంత విశేషమైనది ఉత్థానఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధఎకాదశి నాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొన్న రోజుకే 'ఉత్థాన ఏకాదశి' అని పేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: