కార్తీకమాసంలో స్నానం చేసిన తర్వాత శివాలయం నందు గాని విష్ణు ఆలయం నందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణ తప్పక చేయవలెను అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పము(గన్నేరు పూలు) శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. 


భగవద్గీత కొంతవరకు పఠించినవారికి విష్ణులోకమును ప్రాప్తించును. భగవద్గీత అందలి కడసారి శ్లోకములో నొక్క పరమైన ను కంఠస్తం మొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురని కార్తీక పురాణములో చెప్పబడినది.కార్తీకమాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఎదో చిత్రముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. 


బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేసిన మంచి పుణ్యము వచ్చును. కార్తీకమాసములో చాలామంది వనభోజనము లను ఏర్పాటు చేయుదురు. దీని వలన ఎంతో పుణ్యము లభించును కార్తీక పురాణములో చెప్పబడినది.కార్తీకమాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉసిరిక చెట్టుకింద భగవద్గీతను, కార్తీక పురాణము పారాయణ చేసిన వారికి పరలోకమున మోక్షము లభించును. కార్తీక పురాణము చదువుతున్నప్పుడు ఎవరైనా నిన్న కూడా వారికి కూడా స్వర్గ ప్రాప్తి కలుగును.


కార్తీకమాసపు సంప్రదాయాలన్నీ పర్యావరణ స్ఫూర్తి తో సాగేలా పెద్దలు రూపొందించారు ఈమాసములో నిత్యము ఉసిరి చెట్టు దగ్గరదీపారాధన చేయడం వలన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక మాసం లో శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని ప్రతి సోమవారము ఉసిరి కాయతో దీపములు పెట్టడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. ఉసిరిచెట్టు  కాయలు మంచి ఔషధములు గా పనికి వస్తాయి. కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద బ్రాహ్మణులకు మంచి భోజన సదుపాయము సాలగ్రామ దానము, వెలిగించిన దీపము బ్రాహ్మణులకు ఇచ్చుట వలన ఎన్నో జన్మలలో చేసుకున్న పాపములనుండి విముక్తి పొందగలము.


మరింత సమాచారం తెలుసుకోండి: