భారత దేశంలో ఎంతో మంది దేవుళ్లు.. దేవతలు ఉన్నారు.  అయితే పురాణాల్లో వారి గురించి వినడమే కానీ.. చూసింది లేదు.  కానీ ఆ యుగానికి ప్రత్యక్ష దైవంగా కొలిచేవారిలో షిరిడీ సాయి బాబా ఒకరు.  18వ శతాబ్దంలో ఆయన ప్రజల మద్యలో ఉంటూ ప్రజలను మేల్కోలిపి.. వారి పాపాలను ప్రక్షాళన చేసిన భగవంతుడు.  1854 వేపచెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా మొదటిసారిగా స్థానికులకు కనిపించారు. సుమారు మూడు సంవత్సరాల అనంతరం శిరిడీ చేరుకుని ఖండోబా ఆలయం మర్రిచెట్టు దగ్గర దర్శనమిచ్చారని  చెబుతుంటారు. సాయి బాబా.. కలియుగ దైవంగా చెప్పుకునే సాయినాథుడిని చాలామంది పూజిస్తారు. భక్తితో సేవిస్తారు.  

 

ఇక 1886, ఆగస్టు 18న బాబా శరీరాన్ని విడిచి మూడురోజుల తర్వాత గదాధరుని అవతారకార్యాన్ని స్వీరించి తిరిగిపునరుజ్జీవితులైనట్లుగా చెబుతారు. 1918, అక్టోబర్ 15న బూటివాడలో శిరిడీ సాయిబాబా తిరిగి మహాసమాధి చెందిన రోజుగా చెబుతారు.  సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. 1918లో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నారు. మసీదులో ధునిని వెలిగించారు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు. అది వ వారికి రక్షణ ఇస్తుంది.  

 

వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవారు. చాలా మహత్తులు చూపించారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవారు. సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవారు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్ , అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.  ఇక సాయి బాబా పై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.  కె.వాసు దర్శకత్వంలో గోగినేని నిర్మాతగా.. విజయ్ చందర్ నటించిన శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం సెన్సేషన్ హిట్ అయ్యింది.  ఈ మూవీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాయినాథుడికి భక్తులు మరింత ఎక్కువ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: