శౌర్యప్రతాప పరాక్రమాలకు ప్రతీకలుగా పంచపాండవ్ఞలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవ్ఞలు, వ్యాసవిరచిత మహాభారతంలో మహానుభావ్ఞలుగా, మహిలో వినుతిగాంచిన పురాణ ప్రముఖులు. ముఖ్యంగా భీమసేనుడు పాండవుల్లో మధ్యవాడు. కుంతీదేవికి పాండురాజుకీ వాయు దేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడు. శారీరక బలం దృష్ట్యా ఇతను పదివేల ఏనుగుల బలమున్నవాడు. అయితే మహాభారతంలో కండలవీరుడు భీముడిని ఇష్టపడుతుంది హిడింబి అనే రాక్షస వనిత.

 

పాండవులు లక్కఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత అడవిలోకి వెళ్తారు. ఆ స‌మ‌యంలో మిగిలిన వాళ్లందరూ నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు. వాసనతో వాళ్లను గుర్తుపట్టిన హిడింబాసురుడు, చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ల వివరాలు కనుక్కోమంటాడు. కానీ హిడింబి భీముడిని తొలి చూపులోనే ప్రేమిస్తుంది. భీముడు కాదన్నా, అతడిపై ఉన్న ప్రేమతో ‘మా అన్నవల్ల మీకు ముప్పు ఉంది, ఈ ప్రాంతాన్ని వదిలి పొమ్మ’ని సలహా ఇస్తుంది. భీముడు యుద్ధంలో హిడింబాసురుడిని చంపుతాడు. తర్వాత హిడింబి భీముడిని పెళ్లిచేసుకోమని అడుగుతుంది. 

 

కొంతకాలమే కలిసి ఉంటాను, తర్వాత మేం వెళ్లిపోతాం అని భీముడు పెట్టిన షరతులకు ఒప్పుకుని పెళ్లి చేసుకుంటుంది. భీముడితో ఉన్నన్ని రోజులు అతడికి తన ప్రేమను పంచుతుంది. ఈ స‌మయంలోనే ఘటోత్కచుడిని కంటుంది. అందుకే హిడింబి ప్రేమలో స్వార్థం లేదు. స్వచ్ఛమైంది. ఈ క్ర‌మంలోనే మాట ఇచ్చిన‌ట్టు పాండవులతో పాటు వెళ్లకుండా అక్క‌డే ఉండిపోతుంది. హిడింబి కేవలం ప్రేమికురాలే కాదు. ఆదర్శమైన తల్లి కూడా. భర్త దగ్గర లేకపోయినా కొడుకును ఆదర్శవంతంగా పెంచుతుంది.

 

తండ్రిలేని లోటు రానివ్వదు. మాయలు, మంత్రాలు, యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. అయితే కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కగానొక్క కొడుకు చనిపోతే కన్నీరు మున్నీరవుతుంది. మానసిక ప్రశాంతతకోసం తపస్సు చేస్తూ, ప్రాణాలు వదిలేస్తుంది. కానీ, ఎప్పుడూ అధికారం కోసం ఆరాటపడదు. పట్టపు రాణి కావాలనుకోదు.  చివరి వరకు పచ్చని ప్రకృతి మధ్య, అడవితల్లి ఒడిలోనే బతికింది. 


  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: