ఈ పండుగను మన రాష్ట్రంలో కన్నా మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు. కానీ ఈ పండుగ నాడు ఎవరిని పూజిస్తారో తెలుసా.. సాక్ష్యాత్తు శివుడి కుమారుడైన కుమారస్వామి ని పూజిస్తారు. ఇంతకీ ఈ పండుగకు ఆ పేరెలా వచ్చింది...సుబ్రహ్మణ్య స్వామి వివాహం ఎంతో వైభవంగా జరిగింది..దీనికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. చంపా షష్టి డిసెంబర్ 20వ తేదీ నాడు ఆదివారం మధ్యాహ్నం 2:15 నుండి 2:50 గంటలకు శుభ ముహుర్తం ఉంటుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు మరియు అశ్వతు స్థూపంపై పాము విగ్రహాన్ని పూజిస్తారు. కర్నాటకలోని కుక్కే సుబ్రమణ్య క్షేత్రం నాగ పూజకు ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ మట్టిని ప్రసాదంగా ఇస్తారు. నాగదోషం ఉండేవారు మరియు కుజదోషం ఉండేవారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. ఒకవేళ మీ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తరువాత శివుడిని ఎంతో భక్తితో పూజించాలి. అంతేకాకుండా ఈ శుభ దినాన శివాలయానికి వెళ్లి శివుడిని ఆరాధించాలి. దీనితో మీకు ఆర్ధిక సమయాలు ఉంటే తీరిపోతాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి