మొదటిసారిగా భారతదేశంలో అతిపెద్ద శివలింగం ఆలయం నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అనే విషయానికి వస్తే.. ఔరంగాబాద్ లో దేశంలోనే కనీ వినీ ఎరుగని రీతిలో అతిపెద్ద శివలింగం ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయం అజంతా - ఎల్లోరా గుహలకు అత్యంత సమీపంలో నిర్మించడం గమనార్హం.. భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఈ ఆలయ గర్భంలో ఏర్పాటు చేయనున్నారని సమాచారం.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అతిపెద్దగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శివ భక్తులు దేశంలో వివిధ రాష్ట్రాలలో వెలసిన పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు.. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి.. ఇకపై 12 జ్యోతిర్లింగ విగ్రహాలను ప్రదర్శనను మరింత సులభతరం చేయడానికి.. ప్రత్యేకంగా ప్రదర్శన మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు..గత 26 సంవత్సరాలుగా ఈ పథకం పై పనులు చేయబడుతుండడం గమనార్హం. ఈ దేవాలయం నిర్మాణం 1995వ సంవత్సరంలోనే ప్రారంభమైంది.. మొదట ఈ నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు 108 అడుగుల శివలింగాన్ని నిర్మించాలని వారు ప్రయత్నం చేశారు. కానీ అవసరమైన నిధులు అందకపోవడంతో అప్పుడు కొంతకాలం నిలిపివేశారు. నిధుల కారణంగా 1999వ సంవత్సరంలో ఆలయ నిర్మాణ పనులను ఆపివేయడం జరిగింది.. ఎట్టకేలకు నిధులు సమకూర్చుకున్న ఆలయ నిర్మాణ కర్తలు ,తిరిగి పోయిన సంవత్సరం అనగా 2020 వ సంవత్సరం ఆలయ పనులు తిరిగి ఊపందుకున్నాయి.

ఇక ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుపుకుంటూ చివరి దశకు చేరుకున్నాయి. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కనివిని ఎరుగని పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట నెలకొల్పి రికార్డు సృష్టిస్తున్నారు అధికారులు. 2022 వ సంవత్సరం నాటికి దేవాలయ నిర్మాణం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాంతానికి చేరుకోవాలి అంటే ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు, బస్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలయం పూర్తిగా నలుపురంగులో ఉంటూ.. వర్షాకాలంలో మేఘాల నుంచి వచ్చే నీటి చుక్కలు శివలింగంపై పడే దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

ఆలయం ఎత్తు 60 అడుగులు కాగా ఇందులో శివలింగం ఎత్తు 40 అడుగులు ఉంటుంది.. మొత్తం ఆలయ విస్తీర్ణం 108 చదరపు అడుగులు గా ఉంటుంది.. అంతేకాదు ఈ ఆలయం సాంప్రదాయం దక్షిణ భారతీయ నిర్మాణానికి ఒక చక్కటి ఉదాహరణ .నందీశ్వరుడు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆలయ గోడలపై శివుడు, విష్ణువు 10 అవతారాలను కూడా  చిత్రీకరించడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: