చాలామంది ఆర్థిక పరిస్థితుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఎంత పని చేసినా ఎన్ని ఇబ్బందులు పడినా చేతిలో డబ్బులు నిలవకపోవడంతో అష్ట కష్టాలు పడుతుంటారు. అయితే చాలామంది డబ్బు నిల్వ ఉండడం కోసం ఎన్నో రకాల పూజలు, హోమాలు ఇంట్లో చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఎన్నో పూజలు చేస్తారు.కానీ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఆ ఇంట్లో ఉండే వారికి కచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలట.  మరి ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్న వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఇంతకీ లక్ష్మీదేవి ఎలాంటి లక్షణాలు ఉన్న వారి ఇళ్ళలోకి ప్రవేశిస్తుందో ఇప్పుడు చూద్దాం. 

మహాలక్ష్మి మొత్తం 96 స్థానాల్లో నివసిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా బంగారం,పసుపు, రత్నాలు, వజ్రాలు, బంగారం, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, ఇత్తడి కలశాలు,వెండి, రాగి,ఆవు కొమ్ముల మధ్యన,  ఆవు పేడ వంటి స్థానంలో ఎక్కువగా ఉంటుందట. ఏ ఇంట్లో అయితే శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుందట.ఏ ఇంట్లో అయితే గొడవలు పడుతూ ఎప్పుడు కలహాలు పెట్టుకుంటూ ఇల్లంతా వస్తువులతో శుభ్రత లేకుండా ఉంచుతారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదట. మొదట ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలట. అలా ఇంటి ముందు వేసే ముగ్గు ద్వారానే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట.

అందుకే తెల్లవారు జామున లేచి వాకిలి ఊడ్చి,చల్లి ముగ్గులు పెట్టాలి. అలాగే ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం,నట్టింట్లో చెడుతిట్లు తిట్టడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటికి రాదట. ఏ ఇంట్లో అయితే బద్ధకస్తులు, అబద్ధం చెప్పే వాళ్ళు ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఉదయం సాయంత్రం తప్పనిసరి దీపం వెలిగించాలి. సాయంత్రం పూట పూజ మందిరంలో  ద్వారం దగ్గర సంధ్యా దీపం వెలిగించాలి. ఇలా సంధ్యా దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కచ్చితంగా స్థిర నివాసం ఉంటుంది. ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: