‍‍- అభ‌యాంజ‌నేయ ఆల‌యంలో ఒంటె - కంచు గంట విగ్ర‌హ ప్ర‌తిష్ట‌
- వాన‌ప‌ల్లి బ్ర‌ద‌ర్స్ విగ్ర‌హ బ‌హూక‌ర‌ణ‌
- కంచు గంట బ‌హూక‌రించిన ఘంటా స‌త్య‌నారాయ‌ణ‌, క‌న‌క‌దుర్గ దంప‌తులు

- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏలూరు - కాక‌తీయ ప్ర‌తినిధి : మండ‌లంలోని పాతూరు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వాహనం శిలా విగ్రహరూపంలో ఒంటె ప్రతిష్టాప‌న జ‌రిగింది. ఉద‌యం విశ్వక్సేనపూజా పుణ్యాహవాచనం మండపారాధనలు ఒంటె వాహనానికి పంచ అమృతములతో పళ్ళరాసలతో అభిషేకం చేశారు. అనంతరం గ్రామస్తులు అందరూ విశేష అభిషేకం చేశారు. అనంత‌రం ఉద‌యం 11.37 గంట‌ల‌కు ఒంటె విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌నోత్స‌వం జరిగింది. విగ్ర‌హ దాతలు వానపల్లి కిషోర్ దంపతులు , వానపల్లి మణికంఠ నారాయణ దంపతులు చేతుల మీదుగా ప్రతిష్టించారు. అలాగే పాతూరు కు చెందిన‌ ఘంటా స‌త్య‌నారాయ‌ణ , శ్రీమ‌తి క‌న‌కదుర్గ దంప‌తులు కంచు గంట‌ను బ‌హూక‌రించారు.


ఈ కార్యక్రమం లో మాజీ శాసనసభ్యులు ఘంటా మురళీ రామకృష్ణ , ఘంటా సుధీర్ బాబు , నెక్కలపు సూర్య నారాయణ , ఘంటా స‌త్యంబాబు , అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కమిటీ వారు అఖండ అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమాలు శ్రీ మాన్ సుదర్శనం రామదుర్గ కుమారాచార్యులు , దుర్గ బాబు శ్రీనివాసు , లక్ష్మణాచార్యులు , వెంకటాచార్యులు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: