ముళ్ళ మొక్కల పెంపకం:
చాలామంది ఇంట్లో అందంగా కనిపించడం కోసం ముళ్ళ మొక్కలను పెంచుతూ ఉంటారు. అయితే ఇంట్లో ముళ్ళ మొక్కలనేవి ఉండడం మంచిది కాదట. దీనివల్ల కుటుంబంలో పేదరికం ఏర్పడడమే కాకుండా తరచూ గొడవలు జరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ ముళ్ళ మొక్కలను ఇంటి బయట పెంచి ఇంటి లోపల మనీ ప్లాంట్,తులసి మొక్కలను పెంచితే శుభప్రదం అని, దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని అంటున్నారు.
ఎండిపోయిన పూలు వాడొద్దు:
చాలామంది పూజలు చేసేటప్పుడు పూలతో దేవుళ్లను అలంకరిస్తారు. కానీ ఆ పూలను అలాగే ఉంచి మళ్ళీ ఏ రోజు అయితే పూజిస్తారో ఆ రోజే ఆ ఎండిపోయిన పూలను తీసేస్తారు. అలా చేయకుండా పూజ మందిరంలో స్వచ్ఛమైన పూలు పెట్టి దేవుళ్లను పూజించిన తర్వాత అవి వాడిపోయిన వెంటనే తీసేయాలట. ఎండిపోయిన కానీ అలాగే ఉంచితే అవి ఏ విధంగా ఎండిపోయాయో మన ఇంట్లో కూడా ఆ విధంగానే అంతా ఎండినట్టే ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని సానుకూల వాతావరణము ఉండదని తెలియజేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు పూజా మందిరాన్ని ఆహ్లాదంగా శుభ్రమైన పూలతో సువాసన జల్లేలా ఉంచితే లక్ష్మీదేవికి ఆనందం కలిగి మనకు సంపద పెరుగుతుందని తెలియజేస్తున్నారు.
శంఖం ఊదడం:
ప్రతి ఇంట్లో పూజ గదిలో శంఖాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. పూజ చేసిన సమయంలో శంఖాన్ని ఊదడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దక్షిణ వర్తి శంఖం ధనాన్ని ఆకర్షించేలా చేస్తుందట. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అంతేకాదు ప్రతిరోజు శుభ్రమైన వస్త్రంతోనే పూజ గదిని శుభ్రం చేయాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
నివాసం పరిశుభ్రత:
కొంతమంది ఇల్లును అస్సలు పరిశుభ్రంగా ఉంచరు.. ఇంట్లో ఉండే చెత్తను ఒక మూలన పడేసి అక్కడే ఉంచుతారు. అంతేకాకుండా పడుకున్నటువంటి బట్టలను తీయకుండా చిందర వందరగా పడేస్తారు. అలాగే రాత్రి తిన్నటువంటి ఎంగిలి ప్లేట్లను సింక్లో వేసి ఆ విధంగానే ఉంచుతారు. అలా చేయకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందట. ముఖ్యంగా రాత్రిపూట తిన్నటువంటి ఎంగిలి పాత్రలను అప్పటికప్పుడే శుభ్రం చేసి ఒక వరుసలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వాస్తు, జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీనివల్ల మీకు ఇంట్లో పురోగతి సాధించడమే కాకుండా, ఆనందంగా జీవిస్తారని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి