టి 20 క్రికెట్ పుణ్యమా అని ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాలు సైతం క్రికెట్లో సత్తా చాటు తున్నాయి. ఐసీసీ క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేందుకు చిన్న చిన్న దేశాల మధ్య సైతం టి-20 క్రికెట్ టోర్నమెంట్లో విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా, సింగపూర్, నేపాల్, మలేషియా, నెదర్లాండ్స్ లాంటి దేశాలు సైతం టి-20 క్రికెట్ టోర్నమెంట్లో విస్తృతంగా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాల మధ్య జరుగుతున్న మ్యాచ్ లలో పలు అంతర్జాతీయ రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. తాజాగా నేపాల్ కెప్టెన్ క‌డ్కే సెంచ‌రీతో రికార్డు సాధించాడు.


పెద్ద దేశాల‌కు, వన్డే ప్ర‌పంచ‌క‌ప్ చాంపియ‌న్ అయిన జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉన్న వాళ్ల‌కే సాధ్యం కాని రికార్డు క‌డ్కే సొంత‌మైంది. టీ-20 క్రికెట్లో చేజింగ్‌లో సెంచ‌రీ చేసిన తొలి కెప్టెన్‌గా నేపాల్ కెప్టెన్ క‌డ్కే అంత‌ర్జాతీయ రికార్డు సాధించాడు. సింగ‌పూర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో క‌డ్కే ఈ రికార్డు సాధించాడు. ఇదిలా ఉంటే టీ 20 క్రికెట్లో ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తోన్న సింగ‌పూర్ మ‌రో సంచ‌ల‌నం సాధించింది.


టీ-20లో సింగపూర్‌ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సింగపూర్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) సభ్యత్వం గల దేశంపై తొలి విజయాన్ని అందుకుని నయా రికార్డును నెలకొల్పింది. సింగపూర్‌లో జింబాబ్వే, నేపాల్‌ల‌తో జ‌రుగుతోన్న ముక్కోణ‌పు టోర్న‌మెంటులో భాగంగా ఈ మ్యాచ్ జ‌రిగింది.


ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించడంతో 18 ఓవర్లకు కుదించారు.  దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సింగపూర్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ టిమ్‌ డేవిడ్‌(41), మన్‌ప్రీత్‌ సింగ్‌(41)లు రాణించారు.  జింబాబ్వే 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: