అతని వేదింపులతో నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ తండ్రికి లేఖ రాసింది. ఆరోజు నుండి ఆమె కనిపించడం లేదు. డిగ్రీ విద్యార్థి మౌనిక నాలుగు రోజుల క్రితం కనపడకుండా పోయింది. ఆమె కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌కు చెందిన శ్రీనివాస్‌ కుమార్తె మౌనిక ఈ ఏడాది ఆగస్టులో హిమాయత్‌నగర్‌లోని గౌడ హాస్టల్‌లో చేరింది. నారాయణగూడలోని కేశవమెమోరియల్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది.
 

అయితే గత మంగళవారం (26న) రాత్రి నవీపేట్‌లో ఉన్న తండ్రి శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసిన మౌనిక తమ గ్రామానికి చెందిన పాత స్నేహితుడు మణిరత్నం తరచూ ఫోన్‌చేసి వేధిస్తున్నాడని వాపోయింది. తాను చూసుకుంటానని, భయపడవద్దని తండ్రి  ధైర్యం చెప్పాడు. చెల్లెలిని పిలుచుకురావాల్సిందిగా కుమారుడు నందరాజ్‌గౌడ్‌ను వెంటనే పంపించాడు. అతను వచ్చేలోపు బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో మౌనిక హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లింది. గదిలో ఉండే తోటి రూమెంట్స్ వెతకగా సూసైడ్ నోట్ లభించింది. వెంటనే వారు మౌనిక తండ్రికి ఫోన్‌ చేసి చెప్పారు. 

 

అదేరోజు రాత్రి అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా హాస్టల్‌ వద్ద, ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు.సెంట్రల్‌జోన్‌ డీసీపీ సుమతి ప్రత్యేకంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. 

 


మౌనిక ఆత్మహత్యా ప్రయత్నానికి మణిరత్నం వేదింపులే కారణమా..మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక కాల్ డేటాను పరిశీలించగా నరేశ్ అనే వ్యక్తితో ఎక్కవగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మౌనిక విషయమై పోలీసులు నరేష్ ను ఆరా తీయగా  మౌనిక అదృశ్యం కావడానికి ముందు తనతో వాట్సాప్‌ వీడియో కాల్‌ మాట్లాడిందని ఆమె గ్రామానికే చెందిన నరేశ్‌ చెప్పారు.తాను చనిపోతున్నానని మెసేజ్‌ పెట్టిందని చెప్పాడు. వెంటనే తాను ఎందుకు చనిపోతున్నావు.. వద్దని వారిస్తూ మెసేజ్‌ చేశానని.. ఆ వెంటనే తాను ఎక్కడ ఉన్నది చూపిస్తానంటూ మౌనిక తనకు వాట్సాప్‌ వీడియో కాల్‌ చేసిందని చెప్పాడు. అప్పటికే ఆమె ట్యాంక్‌బండ్‌పై ఉందన్నారు. అఘాయిత్యానికి పాల్పడొద్దని చెప్పానని చెప్పారు. నేను మణిరత్నం టార్చర్ తట్టుకోలేకపోతున్నాని చెప్పి ఫోన్ స్వించ్ ఆఫ్ చేసిందని చెప్పాడు.  అయితే, గంటలు గంటలు మౌనికతో నరేష్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న వైనంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మౌనికతో పాటు నరేష్‌ కాల్స్‌ డేటాను, మణిరత్నం కాల్‌ డేటాను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: