యశస్వి జైస్వాల్..  గత ఏడాది విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా ముంబై తరుపున  బరిలోకి దిగి లిస్ట్ ఏ క్రికెట్ లో  అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసి ప్రపంచ  రికార్డు సృష్టించడం తో అతని పేరు మారుమోగింది. అలా వెలుగులోకి వచ్చిన  జైస్వాల్  తాజాగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ లో అదరగొడుతూ ప్రశంసలు అందుకుంటున్నాడు.  క్రికెటర్ కావాలనే లక్ష్యం తో   ఉత్తర ప్రదేశ్ నుండి ముంబై కు వలస వచ్చాడు   జైస్వాల్...  అయితే ఇంట్లో వారి దగ్గర్నుండి  సపోర్ట్ లభించకపోవడంతో  సాయంత్రం  పానీపూరి  అమ్ముతూ   ఆజాద్ మైదానం కు దగ్గర లో వున్న టెంట్ లో జీవనం సాగించేవాడు.  అలా ఎన్నో కష్టాలు పడి ఈస్థాయికి చేరుకున్న ఈ యువ టీమిండియా  ఆటగాడు ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.  
 
ఇక ప్రస్తుత అండర్ 19ప్రపంచ కప్ లో  నిన్న పాకిస్థాన్  తో జరిగిన మొదటి సెమిస్ లో జైస్వాల్  సెంచరీ తో ఇండియా ను ఫైనల్ కు చేర్చాడు..  దాంతో జైస్వాల్ పై  సోషల్ మీడియా వేదికగా  క్రికెట్ ప్రముఖులతో పాటు ఇతర రంగాల కు చెందిన ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.  పానీపూరి  అమ్మే దగ్గర్నుండి దేశానికి  ప్రాతినిధ్యం వహించే దాక ఎదిగాడు.. అతను ఖచ్చితంగా  సీనియర్  జట్టుకు  భవిష్యత్ ఆశాకిరణంగా మారుతాడని జైస్వాల్ ను కొనియాడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: