టీమిండియా మహిళా జట్టు స్టార్ ఓపెనర్  స్మృతి మందాన బౌండరీల వర్షం కురిపించినా ట్రై సిరీస్ ఫైనల్ లో భారత్ కు  ఓటమి తప్పలేదు. బుధవారం ఆస్ట్రేలియా-భారత మహిళా జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ లో టీమిండియా పై ఆసీస్ 11 పరుగులతో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళా జట్టు నిర్ణీత 20ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 155పరుగులు చేసింది. మూని 71పరుగులతో రాణించింది. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు ఆదిలోనే  ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీ వెర్మ 10పరుగులే చేసి వెనుదిరుగగా  మరో ఓపెనర్ స్మృతి మందాన..  రిచా గోష్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించింది. ముఖ్యంగా స్మృతి  బౌండరీలతో చెలరేగుతూ ఆసీస్ బౌలర్ల కు చుక్కలు చూపెట్టింది. అదే ఊపులో కేవలం 29బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అయితే స్మృతి దూకుడు చూస్తే భారత్ గెలుపు ఖాయమయ్యేలా అనిపించింది కానీ 115పరుగుల వద్ద  ఆమె క్యాచ్ అవుట్ కావడంతో పరిస్థితి మారిపోయింది.  ఆతరువాత వచ్చిన వారు అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరడం తో  భారత్ 20ఓవర్ చివరి బంతికి 144పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. కాగా స్మృతి మందాన 37బంతుల్లో 66పరుగులుచేయగా ఇందులో 12ఫోర్లు ఉండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: