రోజురోజుకి ప్రపంచములో మహిళల క్రికెట్‌ కి క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది అని చెప్పవచ్చు. దీనికి కారణం బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్ వెల్లడించిన ఫలితాలే. ఈ మధ్యనే జరిగిన టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ లో జరిగిన ఉమెన్స్ టీ - 20 వరల్డ్‌ కప్ ఫైనల్‌ కి ఏకంగా ఎనభై ఆరు వేల మందికి పైగా మంది ప్రేక్షకులు స్టేడియానికి వీక్షకులు హాజరయ్యారు. 

 

 


నిజానికి మహిళా క్రికెట్ చరిత్రలో ఇంత మంది ఒక మ్యాచ్‌ ని వీక్షించడం మొదటిసారి అవ్వగా, ఇప్పుడు తాజాగా వ్యూవర్‌ షిప్‌ లోనూ ఆ టోర్నీ అమాంతం సరికొత్త రికార్డులను సృష్టించింది. పోయిన సారి జరిగిన 2018 సంవత్సరంలో జరిగిన మహిళల టీ - 20 వరల్డ్‌ కప్‌ ని కేవలం 1.8 బిలియన్ నిమిషాలు చూసారంటా. అయితే ఈ సంవత్సరంలో జరిగిన వరల్డ్‌ కప్‌ ని మాత్రం ఏకంగా 5.4 బిలియన్ నిమిషాలు వీక్షించినట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఇంతక ముందుకి ఇప్పటికి దాదాపు మూడు రెట్లుపైనే వ్యూవర్‌ షిప్ పెరిగింది. 

 

 


ఇంకా పూర్తిగా చెప్పాలంటే చివరి టీ - 20 ప్రపంచకప్‌ ని 36.9 మిలియన్‌ మంది చూడగా, అది ఈ సంవత్సరం ఏకంగా ఆ సంఖ్య 74.9 మిలియన్లకి చేరిందంట. ఇంత మంది చుసిన భారత్ కప్ గెలవక పోవడంతో భారత అభిమానులు కాసింత నిరాశ చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: