విరాట్ కోహ్లీ... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన ఆటతోనే తను అంటూ ఏందో నిరూపించుకున్న వ్యక్తి కోహ్లీ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియాకు 3 ఫార్మెట్స్ లో కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా కెప్టెన్ గా గత కొన్ని సీజన్ లో నుంచి కొనసాగుతూ వస్తున్నాడు. 


అయితే ఇక అసలు విషయానికి వస్తే... తాను సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును నేను ఎప్పుడికి వదలను, వెళ్ళను అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తన అభిమానులు మాపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకమే దీనికి కారణం అని చెప్పుకొచ్చాడు. Rcb బ్యాట్స్మెన్, అలాగే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏ బి డెవిలియర్స్, విరాట్ కోహ్లీ శుక్రవారం నాడు ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ మధ్యలో RCB తో ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోందని అందరం కలిసి ఐపీఎల్ టైటిల్ గెలిచేది దిశగా ప్రయత్నిస్తున్నామని తన కల అని చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.


RCB జట్టును వదిలిపెట్టి వెళ్లాలని ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదని వచ్చే అవకాశము లేదు అని ఐపీఎల్ ఉన్నంతకాలం నేను rcb జట్టును వదిలి వెళ్ళను. మాపై అభిమానుల ప్రేమ నమ్మకం చాలా ఎక్కువగా చూపించడం ఎంతో అద్భుతం అని కోహ్లీ తెలిపాడు. అయితే ఈ సందర్భంగా డివిలియర్స్ సరదాగా మాట్లాడుతూ నేను కూడా RCB వదిలి వెళ్ళ కూడదని అనుకుంటున్నాను అలా చేయాలంటే నేను తప్పకుండా పరుగులు చేస్తూనే ఉండాలి దీనికి కారణం నేను క్యాపిటన్ కాదు కదా అని కోహ్లీతో డివిలియర్స్ సరదాగా ఒక పంచ డైలాగ్ వేశాడు. అయితే ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా అప్పటి నుంచి కోహ్లీ RCB తరుపున ఆడుతుండగా డెవిలియర్స్ మాత్రం గత తొమ్మిది సంవత్సరాలుగా RCB తోనే ఆడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: