ప్రస్తుతం ప్రపంచంలో కరుణ వైరస్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం ప్రపంచంలో చాలా దేశాలు ప్రస్తుతం లాక్ డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి. అయితే ప్రపంచంలో దీని దెబ్బకి ఇప్పటివరకు రెండు లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాక ఏకంగా 28 లక్షల మంది ఈ వైరస్ దెబ్బతో ఇబ్బంది పడుతున్నారు.

 

ఇక అసలు విషయానికి వస్తే... కరుణ వైరస్ తో ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారికి సహాయం అందించుటకు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ తన జెర్సీ తో పాటు బ్యాట్ ను, అలాగే ఒక వికెట్ ను వేలానికి ఉంచాడు. వీటిని కరోనా మహమ్మారి బారిన పడిన వారికి కోలుకోవడానికి సాయం అందించేందుకు అంటూ పేసర్ వేలానికి సిద్ధపడ్డాడు. అయితే ఈ సంవత్సరం మొదట్లో అనగా జనవరి నెలలో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్ లో ఉపయోగించిన తన వస్తువులను అండర్సన్ వేలానికి పెట్టాడు.

 

ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ నేను చివరగా ఆడిన మ్యాచ్ లో వినియోగించిన జెర్సీతో పాటు బ్యాట్ క్రికెట్ వేలం వేస్తున్నారని తెలిపాడు. దీని ద్వారా వచ్చిన సొమ్ముతో కరోనా వైరస్ పోరుకు వినియోగిస్తాం అని అతను తెలిపాడు.అంతేకాకుండా నేను ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను వాటిపై నేను చేసిన సంతకాలు కూడా ఉన్నాయి అని ఆండర్సన్ ట్విట్టర్ ఖాతా ద్వారా విషయాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: