కపిల్ దేవ్... ఈ పెద్దాయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత దేశానికి మొట్టమొదటి సారిగా క్రికెట్ కు సంబంధించి ప్రపంచ కప్ ను సాధించిన కెప్టెన్ గా తన పేరును చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న వ్యక్తి ఆయన. అయితే ఇక అసలు విషయానికి వస్తే... కరోనా వైరస్ కు సంబంధించి ఒక ఉద్దేశంతో నిధులను స్వీకరించడంలో భాగంగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ను ప్రతిపాదన తీసుకువచ్చిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యలపై మరోసారి కౌంటర్ ఇచ్చారు కపిల్ దేవ్.


ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఒక్కటే మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందంటూ ఆయన అన్నారు. నిజానికి ఆటల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి చాలానే ఉన్నాయని కరోనా వైరస్ కారణంగా పిల్లల భవిష్యత్తు ప్రస్తుతం నాశనం కాబోతోందని అందుకే ముందుగా విద్యాసంస్థలు, కళాశాలలు తెరుచుకోవాలి అన్నది నా అభిప్రాయం అంటూ కపిల్ తెలిపాడు.


ఇక మరోవైపు క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా కరోనా వైరస్ మహమ్మారికి ఎదుర్కొనేందుకు క్రీడారంగం వంతు విరాళములు సేకరించడం అని చెప్పడం సరైనది కాదని ఇంకా వీటికి అనేక మార్గాలు ఎన్నో ఉన్నాయని కపిల్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. " మీరు భావోద్వేగాలకు గురి అవుతారు, టీమ్ ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచులు జరగాలని " ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదాం మీకు అంతగా డబ్బులు అవసరమైతే మొదటగా సరిహద్దుల్లో చేసే దొంగ చాటు పనులు ఆపండి, ఆ తర్వాత దాని ద్వారా వచ్చే డబ్బుతో ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మించుకోవచ్చు అలాగే మాకు నిజంగా డబ్బు అవసరం అయితే ఇక్కడ చాలా మత సంస్థలు ఉన్నాయి అంటూ కపిల్ తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిలబడడం అందరి బాధ్యత అని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: