నేటితో భారత్ టీ - 20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా విధ్వంసక శతకం సాధించి నేటితో కరెక్ట్ గా 10 సంవత్సరాలు. టీ - 20 వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో సురేష్ రైనా 60 బంతుల్లో 101 పరుగులు  (5 సిక్స్ లు, 9 ఫోర్లు) తో చెలరేగి సెంచరీ సాధించాడు. ఇక అలాగే భారత్ తరపున అంతర్జాతీయ టీ - 20 లో తొలి సెంచరీ సాధించిన వ్యక్తి కావడంతో అప్పటి నుంచి సురేష్ రైనాకు టీ - 20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. 

 

 

ఇక ఆ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ రంగంలోకి దిగిన భారత జట్టు మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోవడం జరిగింది. దానితో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సురేష్ రైనా చివరి ఓవర్ వరకు పోరాడి సెంచరీ బాదాడు. అంతే కాకుండా ఈ క్రమంలోనే 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన రైనా ఆ తర్వాత 59 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకోవడం జరిగింది. ఇక చివరికి భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా ... సౌత్ ఆఫ్రికా కేవలం 172/5 వద్ద ఆగిపోవడంతో మ్యాచ్ గెలవడం జరిగింది. 

 

ఇక సురేశ్ రైనా 2006 సంవత్సరంలో అంతర్జాతీయ టీ - 20ల్లోకి మొదటి మ్యాచ్ అడగా మొత్తంగా ఇప్పటి వరకు 78 మ్యాచ్‌ లు ఆడి 1604 పరుగులు చేశాడు. ఇక చివరిగా 2018లో టీ - 20 తరఫున ఆడిన సురేష్ రైనా.. పేలవ ఫామ్ కారణంగా టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయడు. ప్రస్తుతానికి మాత్రం రీ ఎంట్రీ కోసం రైనా ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరం అక్టోబర్ లో జరిగే ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న టి - 20 వరల్డ్ కప్ లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని సురేష్ రైనా ఆశిస్తున్నాడు అని విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: