కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం క్రీడా కార్యకలాపాలకు బ్రేక్ పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. నిజానికి కరోనా దెబ్బకి అనేక దేశ క్రికెట్ సంఘాలు ఇబ్బంది పడుతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ని నడిపించేందుకు ఒక సమర్ధుడు కావాలని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

 

అయితే ఈ విషయంలో భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత bcci అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ స్థానానికి అసలైన వ్యక్తి అని ఆయన తెలిపాడు. ప్రస్తుతం ఆయన భారత బోర్డును అద్భుతంగా నడిపిస్తున్నాడని గంగూలీని పొగడ్తలతో ముంచెత్తాడు గ్రేమ్ స్మిత్. కాకపోతే ఇలాంటి సంక్షోభ సమయంలో ఐసీసీ నడపాలంటే కేవలం నాయకత్వ లక్షణాలు ఉంటే సరిపోదని ఆధునిక క్రికెట్ తో కూడా సంబంధం ఉండాలని, అయితే ఈ రెండు కలిసిన వ్యక్తి గంగూలీ అని ఆయన తెలిపాడు. కాబట్టి గంగూలీ అయితే ఈ విషయానికి సరిగ్గా సరిపోతాడని గ్రేమ్ స్మిత్ ఆ విషయాన్ని తెలియజేశాడు. అయితే ప్రస్తుతం ఐసీసీ ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్ కూడా మన భారతీయుడు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నెల చివర్లో తన పదవీ కాలం ముగిసిన ఉండడంతో తిరిగి మళ్లీ ఆ పదవి చేయబోనని గతంలోని మనోహర్ తెలియజేశారు.

 

అయితే ఇంక ఇదే సందర్భం ప్రస్తుతం ఐసీసీ హెడ్ పదవిని అందుకునేందుకు గంగూలీ అయితే సరిగ్గా సరిపోతాడని స్మిత్ తెలియజేశాడు. ఇక మరోవైపు జూలై నెలలో జరగాల్సిన సౌత్ ఆఫ్రికా - వెస్టిండీస్ సిరీస్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని స్టీవ్ స్మిత్ తెలియజేశాడు. ఇంతకుముందు కూడా ఐసీసీ నడిపించేందుకు గంగూలీకి సామర్థ్యం ఉందని ఇంగ్లాండ్ లెజెండ్ డేవిడ్ గోవ‌ర్ మాట్లాడిన విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: