ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో క్రేజ్ వున్న క్రికెట్ ఆటలో ఎప్పటికప్పుడు వినూత్నమైన టెక్నాలజీని తీసుకు వచ్చి ప్రేక్షకులకు మరింత నాణ్యమైన ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి క్రికెట్ తో పోల్చి చూస్తే..  ప్రస్తుత క్రికెట్లో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకున్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఉన్న టెక్నాలజీతో ఇక బంతి వికెట్లకు తాకిందా లేదా.. అన్న విషయాన్ని తెలుసుకోవడానికి అటు ఎంపైర్ లు ఎంతగానో కష్టపడే వారు. కానీ ఇప్పుడు మాత్రం  ఎల్ఇడి లైట్ లతో కూడిన వికెట్స్ ఉంటున్నాయ్. దీంతో ఇక బంతి వికెట్లకు తాకగానే ఎల్ఈడి లైట్స్ వస్తూ వికెట్కు బంతి తాకింద లేదా అన్న విషయం ఎంతో సులువుగా తెలిసిపోతుంది.



 కేవలం వికెట్ల విషయంలోనే కాదు ఇప్పటి వరకు ఎన్నో సరికొత్త టెక్నాలజీతో కూడిన మార్పులను తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు క్రికెట్ బంతి లో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక సాదాసీదా బంతిని మాత్రమే క్రికెట్ లో వాడే వారు. కానీ ఎప్పుడూ  ఏకంగా ఒక బంతిని బౌలర్ వేస్తున్నాడు అంటే ఆ బంతి ఎంత వేగంగా వెళుతుంది..  ఇక బౌలర్ శక్తి ఎంత ఉంది అన్న విషయాన్ని కూడా ఏకంగా బంతి లో ఉన్న సెన్సార్ ఎంతో సులభంగా తెలియజేయగలుగుతుంది.  ఇక ప్రస్తుతం కరేబియన్ గడ్డపై జరుగుతున్న cpl- 2021లో ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చింది.



 దీంతో ప్రయోగాత్మకంగా స్మార్ట్ బాల్ ను ప్రస్తుతం ఇక ఈ కరేబియన్ లీగ్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. కొక బుర తప్పు కలిసి స్పోర్ట్ కోర్ కంపెనీ దీన్ని రూపొందించింది. అయితే దీని ఆకారం బరువు అన్నీ కూడా అటు సాధారణ బంతి లాగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ బంతి లోపల ఒక ఎలక్ట్రానిక్ చిప్ అమర్చబడి ఉంటుంది. ఇలా బంతి లోపల అమర్చిన ఎలక్ట్రానిక్ చిప్ సెన్సార్ తో బంతి వేగంతో పాటు ఇక స్పిన్ బౌలర్ శక్తిని కూడా అంచనా వేసే అవకాశం ఉంటుందట.  ఇక ప్రస్తుతం కరేబియన్ లీగ్లో అందుబాటులోకి వచ్చిన ఈ బంతి ఇక రానున్న రోజుల్లో అంతర్జాతీయ లీగ్ లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: