టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా పరిస్థితి ప్రస్తుతంఅగమ్య గోచరంగా మారిపోయింది. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్లలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా అటు సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది అనే చెప్పాలి. ఒకవేళ టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు చేరాలి అంటే అద్భుతం జరగాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా సెమీ ఫైనల్ చేరడానికి అటు టీమిండియా భారీ తేడాతో విజయం సాధించడమే కాదు అటు ఇతర జట్లు కూడా ఓడిపోవాల్సి ఉంది. ఇలా టీమ్ ఇండియా సెమీ ఫైనల్లో అర్హత సాధించడానికి మాత్రం దాదాపు అవకాశాలు లేకుండా పోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



అయితే మొదటి మ్యాచ్ నుంచి టీమిండియా ఎంతో పేలవ ప్రదర్శన చేసింది అనే విషయం తెలిసిందే. ఇటువంటి వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా దాయాది దేశమైన పాకిస్థాన్ తో మొదటి మ్యాచ్ ఆడింది. అయితే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా చివరకు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అని చెప్పాలి. పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అనూహ్యమైన పరాజయాన్ని చవిచూసింది టీమిండియా. అయితే రెండో మ్యాచ్లో అయినా టీమిండియా మళ్లీ పుంజుకుంటుంది అని అనుకున్నారు.  కానీ ఊహించని విధంగా మళ్ళి అదే రీతిలో వైఫల్యాన్ని కొనసాగించింది.



 రెండవ మ్యాచ్లో కూడా న్యూజిలాండ్తో చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. దీంతో ఇక టీమ్ ఇండియా సెమీ ఫైనల్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. ఇక టీమిండియా ప్రదర్శనపై ప్రస్తుతం మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల క్రికెట్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా టీమిండియాపై షాకింగ్ కామెంట్ చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఓడిన తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించే దశకు టీమిండియా చేరుకుందని ఆకాశ్ చౌక చెప్పుకొచ్చాడు. ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఘోరమైన పరాభవాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం టీమిండియా ఎగ్జిట్ డోర్ వద్ద నిలిచి ఉంది. టోర్నీలో ముందుకు వెళ్లేందుకు టీమిండియాకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: