ముంబయి వేదికగా న్యూజీలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. మ్యాచ్ రెండో రోజే టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ కూడా ఆరంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో మయాంక అగర్వాల్ సూపర్ సెంచరీతో భారత జట్టు 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత జట్టులో మొత్తం పది వికెట్లను కూడా ఆజాజ్ పటేల్ తీశాడు. పది వికెట్ల ఘనత దక్కించుకున్న మూడో బౌలర్‌గా పటేల్ రికార్డుల్లోకి ఎక్కాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును భారత బౌలర్లు ఆరంభం నుంచి చావు దెబ్బ తీశారు. కివీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకునే అవకాశం భారత్ బౌలర్లు ఇవ్వలేదు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పెవిలియన్‌కు పంపారు. ఆరంభం నుంచే సిరాజ్ చెలరేగి పోయాడు. కేవలం 19 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌కు స్పీన్ త్రయం కూడా తొడవ్వడంతో కివీస్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలిపోయింది. 8 పరుగులు మాత్రమే ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లనుతన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీశాడు.

కివీస్ ఇన్నింగ్స్‌లో కైల్ జెమీసన్ 17 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక కెప్టెన్ టామ్ లాథమ్ కూడా పది పరుగులు చేశాడు. మిగిలిన వారంతా కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. న్యూజీలాండ్ జట్టులో ఇద్దరు డకౌట్ అవ్వగా... కీలకమైన రాస్ టేలర్ కేవలం ఒక్కటంటే ఒక్కటే పరుగు చేసి అవుటయ్యాడు. కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దాంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కివీస్ జట్టుకు ఫాలో ఆన్ ఆడించే అవకాశం భారత్ కు దక్కినప్పటికీ... టీమిండియానే తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. స్కోరు సాధించి కివీస్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలని టీమిండియా భావిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజీలాండ్‌ను సిరాజ్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రాస్ టేలర్ క్లీన్ బౌల్డ్. 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను జెమీసన్ ఆదుకున్నాడు. 17 రన్స్ చేసిన మరి 50 లోపే ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: