సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారత్ తడబడుతోంది. రెండు టెస్ట్ ల అనంతరం ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచారు. కానీ సిరీస్ డిసైడర్ కోసం నిన్నటి నుండి కేప్ టౌన్ వేదికగా మూడవ టెస్ట్ మొదలైంది. మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా మొదటి నుండి తడబడుతూనే ఉంది. అయితే కెప్టెన్ కోహ్లీ ఒక్కడే ఒంటరిగా పుజారా, రహానే, పంత్ ల సహాయంతో జట్టు స్కోర్ ను 200 దాటించాడు. ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఒక్కడే 79 పరుగులు చేసి మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీనితో రెండేళ్ల సెంచరీ దాహానికి తెరపడలేదు. ఇండియా పతనాన్ని శాసించిన రబడా మరియు జాన్సన్ లు 4 మరియు 3 వికెట్లతో మెరిశారు.

తర్వాత మొదట ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికాను బుమ్రా దెబ్బ తీశాడు. ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ను అవుట్ చేసి భారత్ కు కొంచెం ఆనందాన్ని మిగిల్చాడు. అయితే ఈ టెస్ట్ ఇండియాకు చాలా ప్రత్యేకం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ టెస్ట్ మ్యాచ్ గెలిచింది లేదు. అందుకే ఈ మ్యాచ్ ను బీసీసీఐ చాలా కీలకంగా తీసుకుంది. కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం ప్రతి క్షణం ఆటగాళ్లను అలెర్ట్ చేస్తూ సలహాలను ఇస్తూ వస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాను ఎట్టి పరిస్థితుల్లో స్వల్ప స్కోర్ కే ఆల్ అవుట్ చేయాల్సి ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా కన్నా ఎక్కువ పరుగులు చేస్తే చాలా ప్రమాదం.

ఎందుకంటే సఫారీల బ్యాటింగ్ ఎలా ఉన్నా, బౌలింగ్ లో మాత్రం ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ లతో భారత్ ను ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఆరు అడుగులు ఎత్తు ఉన్న జాన్సెన్ బౌలింగ్ కి మన వారి దగ్గర సమాధానం లేదనే చెప్పాలి. అందుకే సౌత్ ఆఫ్రికాను 200 పరుగుల లోపే ఆల్ అవుట్ చెయ్యాలి. ఈ మ్యాచ్ లో ఏ మాత్రం తేడా జరిగి ఓడితే ఇంక పరువు అంతా గంగలో కలిసిపోయినట్టే. మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: