సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం.. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తున్న సమయంలో కొంతమంది ఒకే దగ్గర కూర్చుంటూ ఉంటారు. ఎందుకంటే అదే సెంటిమెంట్ అని చెబుతూ ఉంటారు. అలా కూర్చున్నప్పుడు టీమిండియా విజయం సాధించిందని.. ఇక ఇప్పుడు కూడా టీమిండియా గెలవాలని ఇలాగే కూర్చున్నాను లేదా అదే పని చేస్తున్నాను అని చెబుతూ ఉంటారు. ఇలాంటి సెంటిమెంట్ చూసిన తర్వాత అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి సెంటిమెంట్లు కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు అటు క్రికెటర్లకు కూడా ఉంటాయి అన్నది చెప్పిన సచిన్ మాటలతో అందరికీ అర్థమైపోతుంది.


 2011లో టీమ్ ఇండియా ప్రపంచ కప్ను ముద్దాడింది. ఇక ఈ అద్భుతమైన ఘట్టం జరిగి దాదాపు 11 ఏళ్ళు గడిచి పోతున్నాయ్. సరిగ్గా ఇదే రోజు  పదకొండేళ్ల క్రితం ఇక భారత్ ప్రపంచకప్ ఫైనల్లో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఇక మహేంద్రసింగ్ ధోని ఆడిన చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ని ఇప్పటికీ భారత క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఇక ఆ అపురూప క్షణాలను మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యాతగా అభివర్ణించిన మాటలు ఇప్పటికీ ప్రేక్షకులు మార్మోగిపోతూ ఉన్నాయి. 28 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత భారత వరల్డ్ కప్ గెలిచింది.


 అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయం లోనే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సెహ్వాగ్ సచిన్ ఓపెనర్లుగా రాగా వీరేంద్ర సెహ్వాగ్ 0, సచిన్ 18 పరుగులకు అవుటయ్యారు. అయితే సచిన్ అంతకు ముందు అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తలకు మసాజ్ చేసుకుంటూ ఉండగా పక్కనే వీరు  కూర్చున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా టీమిండియా బాగా ఆడి విజయం సాధించింది. ఇక ఫైనల్ రోజు కూడా వికెట్ కోల్పోయిన తర్వాత సచిన్ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లి టేబుల్ మీద కూర్చుని మసాజ్ చేసుకుంటున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ ను పక్కనే  కూర్చోమని చెప్పాడు. కొంతసేపయిన మ్యాచ్ చూడనివ్వు అని బ్రతిమిలాడిన కుదరదు అని సచిన్ చెప్పేశాడట. ఇక చివరికి ఇద్దరూ అలాగే కూర్చున్నారు ఆ తర్వాత టీమిండియా ఘనవిజయం సాధించింది ఈ సరదా సన్నివేశాన్ని ఓ ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చాడూ సచిన్ టెండూల్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: