ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఎంతో హోరాహోరీగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయఢంకా మోగించింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కారణంగా అదృష్టం కలిసి వచ్చి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇటీవలే ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో తో తలపడింది. అయితే లక్నో ఫీల్డర్లు వరుసగా క్యాచ్ డ్రాప్ చేయడంతోపాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 చివరికి ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం సిద్ధం అవుతుండగా అటు ఓడిపోయిన లక్నో జట్టు ఇంటి బాట పట్టింది  అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతూ వచ్చింది. కానీ ఊహించని విధంగాఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. అయితే ఇటీవల చావో రేవో తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో ఓడిపోయినప్పటికీ అటు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.


 గత కొన్ని ఐపీఎల్ సీజన్ల నుంచి మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ అదిరిపోయే ఫామ్ లో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ నాలుగు ఐపీఎల్ సీజన్ లలో ఆరువందలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2022లో కేఎల్ రాహుల్ 616 పరుగులు సాధించాడు. దీంతో ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మూడు సీజన్లలో ఆరువందలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఏదేమైనా అటు లక్నో పరాజయం మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు లోను చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: