ఈ క్రమంలోనే తమ కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇప్పటి వరకు ఎంతోమంది క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా నిజాలు బయటపెట్టి సంచలనం సృష్టించారు. అటు క్రీడా రంగంలో కూడా ఇక ఇలాంటి వేధింపులు తప్పడం లేదు అన్నది ఎంతో మంది అనుకునే మాట. ఇక ఇటీవల ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది ఒక మహిళా సైక్లిస్ట్. కోచ్ వ్యవహరించే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తన రూమ్ లోకి రావాలి అంటూ పిలిచాడు అంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారిపోయింది.
భారత సైక్లింగ్ కోచ్ గా ఉన్న ఆర్కే శర్మ పై ఒక మహిళ సైక్లిస్ట్ సంచలన ఆరోపణలు చేయడం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. స్లోవేనియాలో ఉన్న సమయంలో హోటల్లోని తన గదికి రావాలని తనతో పడుకోవాలి అంటూ బలవంతం చేశాడనీ సదరు మహిళా సైక్లిస్ట్ చెప్పడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది మహిళా సైక్లిస్ట్. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు నాతో భార్యల సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటు నాతో అసభ్యంగా మాట్లాడాడు అంటు తెలిపింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిపై స్పందిస్తూ విచారణకు ఒక కమిటీని నియమించడం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి