ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జులై 1వ తేదీ నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదో టెస్టు మ్యాచ్ కు ముందు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ కరోనా వైరస్ బారినపడి జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అతను మళ్లీ వైరస్ బారి నుంచి కోలుకుని జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం మాత్రం తక్కువగానే కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియాలో పలు మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే ఎవరిని ఏ స్థానంలో బ్యాటింగ్కు దింపితే  బాగుంటుంది ఇక ఎవరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అన్న విషయం పై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ టీమిండియా కు అందుబాటులో ఉండక పోతే ఇంగ్లాండ్ తో టెస్ట్ కి ఓపెనర్గా ఛటేశ్వర్ పూజారా లేదా హనుమ విహారిని ఎంచుకోవాలి అంటూ సూచించాడు. ఇక ఏకైక టెస్టు మ్యాచ్లో అనుభవం ఉన్న ప్లేయర్లను బరిలోకి దింపాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.మయాంక్ అగర్వాల్ కి తగినంత నెట్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అతను సిద్ధంగా ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు.



 అయితే కేఎస్ భరత్ ను మాత్రం ఓపెనర్గా కన్సిడర్ చేయకపోవడం గమనార్హం. విహారి ఇప్పటికి భారత్ తరపున రెండుసార్లు ఓపెనింగ్లో దిగాడు. ఇక పూజారాకు కూడా ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. అందుకే ఇద్దరు అనుభవజ్ఞులైన ప్లేయర్లను ఓపెనర్లుగా పంపిస్తే  బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇటీవల సోనీ స్పోర్ట్స్ తో మాట్లాడిన అజిత్ అగార్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే అటు టీమిండియా బూమ్రా  కెప్టెన్సీ లో బరిలోకి దిగబోతోంది అన్నది తెలిసిందే. అయితే టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ లో విజయం సాధించాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: