ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకుంది ఇక క్లీన్స్వీప్ చేస్తుందని అనుకున్నప్పటికీ 3వ టి20 మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. వన్డే సిరీస్లో కూడా ఇండియా మంచి ప్రదర్శన చేసింది అని చెప్పాలి. మొదటి వన్డే లో అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకుని ఘన విజయాన్ని అందుకుంది. ఇక రెండో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందని అందరు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇంగ్లాండ్ జట్టు పుంజుకుంది. రెండో వన్డే మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమానంగా ఉంది అనే చెప్పాలి.
ఈ క్రమంలోనే నేడు జరగబోయే మూడో వన్డే మ్యాచ్ ఫలితం తేల్చి మ్యాచ్ గా మారిపోయింది. ఇక ఇరు జట్లు కూడా నేడు మూడో వన్డే విజయంపై కన్నేసాయ్ అని చెప్పాలి. మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారికి సిరీస్ వశం అవుతుంది. అయితే మూడో వన్డే విజయం సాధించి ఇంగ్లాండ్ టూర్ ఘనంగా ముగించాలని లక్ష్యంతో బరిలోకి దిగబోతోంది ఇండియా. ఈ మ్యాచ్లో అయిన కోహ్లీ రాణించాలి అని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో రోహిత్ సేన బరిలోకి దిగేందుకు సిద్ధం అయింది. అదే సమయంలో అటు ఇంగ్లండ్ జట్టు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతోంది అనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి