ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్ల మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇరు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు హోరాహోరీగా నే పోరాడుతున్నారని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఎంతో మంది ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డులు కొల్లగొట్టడం కూడా చేస్తూ ఉన్నాము. ఇటీవలే బ్రిస్టల్  వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో ఆల్ రౌండర్ మోయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు అని చెప్పాలి.  ఈ క్రమంలోనే 16 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ అర్థ సెంచరీ  సెంచరీ సాధించాడు.


 ఈ క్రమంలోనే అతని ఇన్నింగ్స్ జట్టు విజయానికి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పాలి. ఇక 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్ లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా సీనియర్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు అని చెప్పాలి. అంతకుముందు పాకిస్థాన్ జట్టుపై జరిగిన టి20 మ్యాచ్ లో లియాన్ లివింగ్ స్టోన్ 17 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి రికార్డు సృష్టించగా ఇప్పుడు మోయిన్ అలీ  కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి లియాన్ లివింగ్ స్టోన్ రికార్డును బ్రేక్ చేసేసాడు అని చెప్పాలి.



 ఇక ఇలా టీ20 లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇయాన్ మోర్గాన్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఈ లిస్టులో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌత్ఆఫ్రికాపై ఇంగ్లాండ్ జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది . తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష్యసాధనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 193 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: