సాధారణంగా క్రికెటర్లు ఎవరైనా సరే నిబంధనలు ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎవరైనా క్రికెటర్లు కాస్త అతిగా ప్రవర్తించారు అంటే చాలు ఫీల్డ్ అంపైర్లు వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు కేవలం నిబంధనల మేరకు మాత్రమే ప్రవర్తించడం లాంటిది చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా  జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల మధ్య జరిగే చిన్నపాటి గొడవలు చివరికి మితిమీరిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక అయితే ఇటీవల  దులీప్ ట్రోఫీలో కూడా ఇలాంటిదే జరిగింది.



 ఇటీవల సౌత్ జోన్తో ముగిసిన ఫైనల్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి అందరి మన్ననలు అందుకున్నాడు ముంబై యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్. దీంతో అతని ప్రతిభ పై అందరూ ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. కానీ చివరి రోజు ఆటలో భాగంగా తన దురుసు ప్రవర్తనతో చివరికి విమర్శలపాలు అయ్యాడు. ప్రతి ఒక్కరు కూడా యశస్వి జైస్వాల్ దురుసు ప్రవర్తన గురించి చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. సౌత్ జోన్ బ్యాట్స్మెన్ రవితేజను పదేపదే స్లెడ్జింగ్ చేస్తూ కాస్త హద్దులు మీరు ప్రవర్తించాడు. అయితే అప్పటికే రెండుసార్లు కెప్టెన్ అజింక్య రహానే  చెప్పినప్పటికీ కూడా వినకుండా స్లెడ్జింగ్  చేయడంతో ఎంపైర్లు కల్పించుకొని యశస్వి జైస్వాల్ ను హెచ్చరించారు.


 అయినప్పటికీ అతని తీరులో మార్పు రాకపోవడంతో చివరికి కెప్టెన్ అజంక్య రహనే అతడిని ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళగొట్టాడు అని చెప్పాలి. నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి  154 పరుగుల వద్ద ఐదో రోజు ఆరంభించింది సౌత్ జోన్. తొలి సెషన్ లో కాస్త మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే  హైదరాబాద్ బ్యాట్స్మెన్ రవితేజను లక్ష్యంగా చేసుకుని స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టాడు యశస్వి జైస్వాల్. ఈ క్రమంలోనె రవితేజ ప్రత్యర్థి  కెప్టెన్ అజింక్య రహానే కి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ యశస్వి జైష్వాల్ మాత్రం వినకపోవడంతో చివరికి ఎంపైర్లు  కూడా అసహనం వ్యక్తం చేశారు. దీంతో అజింక్య రహానే  కల్పించుకొని అతన్ని మైదానం నుంచి వెళ్లగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. కాగా ఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ 294 పరుగులు తేడాతో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: