సాధారణంగా సోషల్ మీడియా కాస్త ఎక్కువగా పాపులారిటీ ఉండే క్రికెటర్లు ఏదైనా వివాదంలో చిక్కుకున్నారు అంటే చాలు ఆ వార్త ఏకంగా సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఒకటి వైరల్ గా మారిపోయింది. ఒకప్పుడు భారత క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగి ఇక ఇప్పుడు మాజీ ఆటగాడిగా కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు దగ్గరగా ఉండే యువరాజ్ సింగ్ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల గోవా అధికారులు యువరాజ్ సింగ్ కి నోటీసులు అందజేసారు. మొర్జీమ్ లోని తన విల్లా ను ఇక అధికారుల అనుమతి లేకుండానే గెస్ట్ లకు అద్దెకు ఇవ్వనున్నట్లు ఆన్లైన్ లో పెట్టడంతో ఇక ఈ వివాదం తెరమీదకి వచ్చింది.


 ఇక ఈ వార్త కాస్త ప్రస్తుతం అభిమానులు అందరిని కూడా షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి. అయితే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం.. గోవాలో ఎవరికైనా తమ ఇళ్ళను పెయింగ్ గెస్ట్ లకు ఇవ్వాలి అంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే యువరాజ్ సింగ్ మాత్రం ఇక ఇలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను జరపకుండానే గెస్ట్ లకు తన విల్లా ను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అధికారుల నుంచి నోటీసులు అందుకున్నాడు. ఉత్తర గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో యువరాజ్ సింగ్ కు కాసా సింగ్ పేరిట ఒక విల్లా ఉంది.


 అయితే ఇకపోతే ఇటీవలే గోవా అధికారులు యువరాజ్ సింగ్ కి నోటీసులు అందజేయగా డిసెంబర్ 8వ తేదీన ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలి అంటూ అధికారులు పేర్కొన్నారు.  ఇక చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయకుండానే గెస్ట్ లకు అద్దెకిచ్చేందుకు సిద్ధపడిన యువరాజ్ సింగ్ కి లక్ష రూపాయల జరిమానా వేధించగా.. ఇక ఈ జరిమానా ఎందుకు విధించకూడదో యువరాజ్ సింగ్ ను ప్రశ్నించనున్నారు అధికారులు. ఈ క్రమంలోని అధికారులు కోరినట్లు గానే యువరాజ్ సింగ్ ఇక అధికారులకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: