క్రీడా ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురుచూసిన ఫిఫా వరల్డ్ కప్ ఇటీవలే ఖతార్ వేదికగా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ఇకపోతే మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ మాదిరిగానే ప్రస్తుతం ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ లో భాగంగా అటు ఛాంపియన్ జట్లకు ఊహించని షాకులు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే సౌదీ అరేబియా, ఛాంపియన్ అర్జెంటిన జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

 ఎంతో రసవతరంగా జరిగిన ఈ పోరులో ఎవరు ఊహించిన విధంగా ఛాంపియన్ అర్జెంటినా జట్టు సౌదీ అరేబియా చేతిలో 2-1 తేడాతో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. దీంతో అర్జెంటినా జైత్రయాత్రకు బ్రేక్ పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అర్జెంటినా జట్టు మ్యాచ్ ఓడిపోగానే స్టాండ్స్ లో ఇక జట్టుకు మద్దతు పలకడానికి వచ్చిన అభిమానులు అందరూ కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం అర్జెంటీనా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న లియోనాల్ మెస్సికి ఇదే చివరి ఫిఫా వరల్డ్ కప్ కావడం గమనార్హం.


 తొలి మ్యాచ్ లోనే ఓటమి శుభసూచికం కాదు అనే అభిమానులు అందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. అయితే సౌదీ అరేబియాతో మ్యాచ్కు ముందు అర్జెంటీనా జట్టు వరుసగా 36 మ్యాచ్లో ఓటమి ఎరుగని జట్టుగా దూసుకు వచ్చింది. ఇందులో 25 విజయాలు ఉండగా 11 మ్యాచులు డ్రా గా ముగిసాయి. 2009లో అమెరికా కప్ సెమీఫైనల్ లో బ్రెజిల్ చేతిలో ఓడిన అర్జెంటీనా  ఆ తర్వాత ఒక్క ఓటమి కూడా చవి చూడలేదు. అయితే ఇప్పుడు వరకు ఇటలీ జట్టు వరుసగా 37 మ్యాచులలో ఓటమి ఎరుగని జట్టుగా తొలి స్థానంలో ఉంది. ఇక అర్జెంటీనా ఇటలీ రికార్డును బద్దలు కొడుతుందని అభిమానులు భావించారు. కానీ మెస్సి బృందానికి సౌదీ అరేబియా ఆ ఛాన్స్ లేకుండా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: