గత కొంతకాలం నుంచి టీమిండియాలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తున్న సూర్య కుమార్ యాదవ్ తక్కువ సమయంలోనే ఏకంగా ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా భారత జట్టులోకి అరంగేట్రంచేసిన ఏడాది కాలంలోనే ఇక ఇలాంటి అరుదైన ఘనతను అందుకోవడం క్రికెట్ ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యంలో  ముంచేసింది. అయితే కేవలం పొరపాటున మాత్రమే సూర్యకుమార్ అగ్రస్థానంలోకి వచ్చాడని మొదట కొంతమంది భావించారు. కానీ ఆ తర్వాత  అతని అద్భుతమైన ప్రదర్శన ద్వారా ఇక అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్న తీరు చూసి నెంబర్ వన్ స్థానానికి అతనే అసలైన అర్హుడు అంటూ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.


 కెరియర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే రెండుసార్లు తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఇక ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానాన్ని పదిలంగానే ఉంచుకున్నాడు. 890 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన పాకిస్తాన్ కెప్టెన్ ఆ జట్టు స్టార్ ఓపెనర్ బాబర్  మాత్రం 4వ స్థానంలో ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే బాబర్  పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో ట్రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ మరోసారి నెంబర్వన్ స్థానంలో నిలువగా.. తర్వాత స్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు మహమ్మద్ రిజ్వాన్.. బాబర్ అజామ్ లు ఉన్నారు.  ఈ క్రమంలోనే బాబర్  సోషల్ మీడియాలో స్పందిస్తూ రిలాక్సింగ్ అండర్ ద బ్లూ స్కై అని ఒక పోస్ట్ పెట్టగా.. నెట్టింట్లో ట్రోల్స్ జరుగుతున్నాయి. అవును నువ్వు మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి చేరలేవు. స్కై కింద రిలాక్టివ్ గా ఉండు అంటూ టోల్స్ చేస్తున్నారు. కాగా సూర్య కుమార్ యాదవ్ ని షార్ట్ కట్ లో sky అని పిలుస్తారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: