ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఎన్ని రికార్డులు ఉన్నాయో తెలిసిందే. ఈ జట్టును అత్యంత సక్సెస్ఫుల్ జట్టుగా ముందుండి నడిపించాడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అయితే ఈసారి తన ఆఖరి సీజన్ అంటూ ఇప్పటికే బయట లీకులు మొదలయ్యాయి. కాగా ఈసారి చెన్నై తమ జట్టులో గత సంవత్సరం నుండి కొనసాగుతున్న ఆటగాళ్లలో ఆశించిన విధంగా ఆడనివారిని జట్టు నుండి రేపు నెలలో జరగనున్న మినీ వేలానికి వదిలేసింది. ఇక జట్టుతో పాటు అంటిపెట్టుకున్న ఆటగాళ్లలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకరు. గతంలో ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులో చోటును దక్కించుకున్నాడు.

కానీ మొదట్లోనే విఫలం కావడంతో మళ్ళీ ఛాన్స్ రావాలంటే కొంతకాలం ఆగాల్సి ఉంది. ప్రస్తుతం ఇతను విజయ్ హజారే ట్రోపీలో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ రోజు ఉత్తరప్రదేశ్ తో జరిగిన ఖ్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ను ఆడాడు.. ఈ ఇన్నింగ్స్ లో కేవలం 159 బంతుల్లో 220 పరుగులు చేసి సీనియర్స్ సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఈ స్కోర్ లో 10 ఫోర్లు మరియు 16 సిక్సర్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా 49 వ ఓవర్ లో ఏకంగా 7 సిక్సులు కొట్టి దిగ్గజాల సరసన చేరాడు. ఇక మరో విశేషం ఏమిటంటే విజయ్ హజారే ట్రోపీలో నాలుగు సెంచరీలు చేసి కోహ్లీ రికార్డును సమం చేశాడు.  

దీనితో చెన్నై తరపున ఐపీఎల్ ఆడుతున్న ఇతనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గతంలో కూడా ఇలాగె కేవలం ఒక సీజన్ లో విశేషంగా రాణించి, తర్వాత సీజన్ లో ఉసూరుమనిపించాడు. ఇప్పుడు దేశవాళీ టోర్నీలో మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ ఇదే ఫామ్ ను ఐపీఎల్ లో కొనసాగిస్తాడా అని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సందేహాలు వెలిబుచ్చుతున్నారు. మరి చూద్దాం ఏమి జరగనుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: