
అదే సమయంలో ఇక వచ్చే ఏడాది మొదటి వారం నుంచి అటు భారత జట్టు వరుస సిరీస్ లతో ఎంతో బిజీ అవ్వ పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనవరిలో భారత పర్యటనకు రాబోతున్న శ్రీలంక జట్టుతో వరుసగా సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే ఇక శ్రీలంకతో జరగబోయే టి20 వన్డే సిరీస్ లలో తలబడబోయే భారత జట్టు వివరాలను ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలోనే అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో టి20సిరీస్ లో బరిలోకి దిగే టీమ్ ఇండియా.. ఇక వన్డే సిరీస్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్యంలోనే పోటీ పడబోతుంది.
భారత పర్యటనకు రాబోతున్న శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ షెడ్యూల్ వివరాలు చూసుకుంటే..
జనవరి 3వ తేదీన ముంబై వేదికగా తొలి టీ-20 మ్యాచ్ జరగబోతుంది. జనవరి 5వ తేదీన రెండవ టి20 మ్యాచ్ పూనే వేదికగా.. జనవరి ఏడవ తేదీన మూడవ టి20 మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఇక ఈ మూడు మ్యాచ్లు కూడా సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్నాయి.
ఇక వన్డే సిరీస్ షెడ్యూల్ విషయానికొస్తే..
జనవరి 10వ తేదీన తొలి వన్డే మ్యాచ్ గౌహతి వేదికగా జరగనుంది.
జనవరి 12వ తేదీన రెండో వన్డే మ్యాచ్ కోల్కతా వేదికగా..
జనవరి 15వ తేదీన మూడవ వన్డే మ్యాచ్ త్రివేండ్రం వేదికగా జరగనుంది. ఇక 3 వన్డే మ్యాచ్లు కూడా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పాలి.