బూమ్రా తర్వాత ఆ స్థాయిలో బౌలింగ్ చేసే బౌలర్ టీమిండియా కు దొరుకుతాడా లేడా అనే అభిమానులు అనుకుంటున్న సమయంలో అర్షదీప్ మాత్రం బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని తానే అన్న విషయాన్ని తన బౌలింగ్ తో నిరూపించాడు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో సైతం ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతమైన బంతులను సందిస్తూ ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించాడు అని చెప్పాలి. దీంతో ఇక ప్రస్తుతం టీమిండియా ఎలాంటి సిరీస్ ఆడిన కూడా ఆ జట్టులో అర్షదీప్ స్థానం దక్కించుకుంటున్నాడు అని చెప్పాలి.
ఇలా తన ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరిచిన అర్షదీప్ ఇటీవలె శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్లలో మాత్రం పేలవ ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా రెండో టి20 మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ తన ప్రదర్శనతో అందరికీ షాక్ ఇచ్చాడు. రెండో ఓవర్ లో ఆఖరి బంతికి వరుసగా మూడు నోబాల్స్ వేసి అందరికి చిరాకు తెప్పించాడు. ఆ తర్వాత కీలకమైన 19వ ఓవర్ లోను మరో రెండు నోబాల్స్ వేశాడు. దీంతో ఎన్నో చెత్త రికార్డులు అతని ఖాతాలో చేరిపోయాయి. అంతర్జాతీయ టి20లలో ఎక్కువ (14)నోబాల్స్ వేసిన ఆటగాడిగా.. అంతేకాదు హ్యాట్రిక్ నో బాల్స్ వేసిన ప్లేయర్ గా కూడా చెత్త రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు అర్షదీప్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి