గత కొంతకాలం నుంచి భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ కూడా అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతూ అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్లు అయితే సెంచరీలు డబుల్ సెంచరీలతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. అయితే శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టిన శుభమన్ గిల్ ఇక ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగించాడు.



 మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా తక్కువ పరుగులకు వికెట్లు  కోల్పోతున్న సమయంలో శివమన్ గిల్ మాత్రం అటు క్రీజులో పాతుకుపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు ఇక భారీ షాట్లకు ప్రయత్నించాడు. తద్వారా సెంచరీ చేశాడు. ఇక ఆ సెంచరీని డబుల్ సెంచరీగా కూడా మలిచాడు. కేవలం 149 బంతుల్లోనే 208 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు శుభమన్ గిల్. అంతే కాదు 23 ఏళ్ల 135 రోజుల వయసులోనే డబుల్ సెంచరీ సాధించి ఇక ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించాడు.


 ఈ క్రమంలోనే డబుల్ సెంచరీ గురించి శుభమన్ గిల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ఎక్కువగా డాట్ బాల్స్ లేకుండా ఉండేందుకు స్ట్రైకింగ్ రొటేట్ చేయడానికి ప్రయత్నించాను. ఇక ఇందుకోసం గ్యాప్ లో బంతిని వేయాలని అనుకున్నాను. ఇక మరోవైపు నుంచి వికెట్లు పడుతున్న చివరి వరకు క్రీజులో ఉండాలని భావించాను. అంతేకానీ డబుల్ సెంచరీ చేయాలని మాత్రం ఎక్కడ ఆలోచన చేయలేదు. కానీ ప్రత్యర్థిలను ఒత్తిడికి గురి చేస్తు ఆడాలని అనుకూన్నా.. చివరికి డబుల్ సెంచరీ సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: