ఇక వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఇండియా చాలా ఘోరంగా ఓడించింది. ఏకంగా 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది ఇండియా. ఇప్పుడు 2 జట్ల మధ్య టీ20 సిరీస్ అనేది జరగనుంది.ఫస్ట్ మ్యాచ్ శుక్రవారం నాడు రాంచీలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనుంది. ఇక్కడ ఇప్పటి దాకా టీమ్ ఇండియా రికార్డు చాలా అద్భుతంగా ఉంది. ఈ మైదానంలో టీమ్‌ ఇండియా ఇప్పటిదాకా ఒక్క టీ20 మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను కూడా ఓడించిన రికార్డ్ కేవలం టీమిండియాకు ఉంది. ఇప్పుడు మరోసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో జనవరి 27 వ తేదీన భారత జట్టు రంగంలోకి దిగనుంది.ఇక రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో ఇండియా టీ20 మ్యాచ్‌ల రికార్డు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఇప్పటి దాకా ఇక్కడ టీ20 మ్యాచ్‌లో ఒక్క టీ20 కూడా ఇండియా ఓడిపోలేదు. 3 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. మూడింటిలో కూడా గెలిచింది. 2016 వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఇక్కడ ఇండియా 69 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.


ఇక ఆ తర్వాత 2017 వ సంవత్సరంలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఇండియా చేతిలో ఓడిపోయింది. 2021 వ సంవత్సరంలో న్యూజిలాండ్‌పై టీమిండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అందుకే ఈసారి కూడా భారత జట్టు తన రికార్డును నిలబెట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది.ఇప్పటి దాకా రాంచీలో ఇండియా-న్యూజిలాండ్ మధ్య ఒకే ఒక్క టీ20 మ్యాచ్ అనేది జరిగింది. ఇందులో టీమిండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవంబర్ 2021 వ సంవత్సరంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొత్తం 153 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కేవలం 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా తరుపున కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంకా కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: