సాధారణంగా ఆస్ట్రేలియా భారత్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతుందంటే చాలు ఇక మాటలు యుద్ధం ఒక రేంజ్ లో జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.  ఇరు జట్లలో ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు రివ్యూలు ఇచ్చే మాజీ ఆటగాళ్ల మధ్య కూడా ఇలా మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే అటు ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా మైండ్ గేమ్స్ స్టార్ట్ చేసింది అన్న విషయం తెలిసిందే . భారత్లో ఎక్కువగా స్పిన్ పిచ్ లను తయారు చేస్తారని భారత్కు అనుకూలంగానే ఈ పిచ్ లు ఉంటాయని పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.


 ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాళ్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ పిచ్ వివాదం గురించి ఆస్ట్రేలియా కోచ్ మెక్ డోనాల్డ్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  తన టీం కండిషన్స్ కు తగినట్లుగా మారి సమస్యలను పరిష్కరించే వారిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.. ఎలాంటి సవాలు కైనా సిద్ధంగానే ఉన్నాం అంటూ తెలిపాడు. టెస్ట్ క్రికెట్ గొప్పతనం ఇదే. ఓ దేశం నుంచి మరో దేశానికి వెళ్లి ఆడాలి. ఇక ఓ దేశంలోనే ఒక్కొక్క పిచ్ లో ఒక్కో కండిషన్లు ఉంటాయి. నిజాయితీగా చెప్పాలంటే పిచ్ డ్రై గానే ఉంది. ఇదే ఊహించాం కూడా. ఇండియాలో అత్యధిక టర్న్, రివర్స్ స్వింగ్ ఉన్న పిచ్ గా నాగపూర్ కు  పేరు  అయితే ఈ సవాలకు మేము సిద్ధంగానే ఉన్నాము అంటూ మేక్ డోనాల్డ్ చెప్పుకొచ్చాడు.


 అయితే ఆస్ట్రేలియా జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు ఎక్కువమంది ఉన్నారు  వాళ్ళకి నాగపూర్ పిచ్ లో ఆడటం కాస్త కష్టమే. కానీ ఇక పిచ్ లో ఉన్న సమస్యలను మా బ్యాటర్లు  పరిష్కరిస్తారు. అయితే స్వదేశంలో పరిస్థితులను ఎవరైనా అనుకూలంగా మార్చుకుంటారు.. ఆస్ట్రేలియాలో కాస్త అదనపు బౌన్స్, పిచ్ పై పచ్చిగా ఎక్కువగా ఉంటాయి. అయితే టెస్ట్ క్రికెట్లో వివిధ కండిషన్స్ వివిధ దేశాల్లో ఆడుతుంటేనే ఇక అసలైన నైపుణ్యాలు బయటపడతాయి. అన్ని చోట్ల ఒకే పిచ్ ఉంటే ఇక క్రికెట్లో మజా ఏమంటుంది అంటే ఆస్ట్రేలియా మెక్ డోనాల్డ్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: