ఇక ప్రస్తుతం క్రికెట్ నే ప్రొఫెషన్ గా మార్చుకోవాలి అనుకుంటున్నా ఎంతోమంది యువకులకు సైతం అటు విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే క్రికెట్లో మాత్రమే కాటు ఇక అటు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకోవడంలో కూడా కోహ్లీ ఎప్పుడు ముందుంటాడు. కోహ్లీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ తమ దేశ జట్టుకు మద్దతు పలికే వారి కంటే అటు కోహ్లీ బాగా ఆడితే చూడాలని కోరుకునే వారు ఎక్కువగా ఉంటారు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు మైదానంలో మ్యాచ్ వీక్షించడానికి వచ్చినప్పుడు ఇక కొన్ని రకాల ఫ్లకార్డులు పట్టుకొని మీడియా దృష్టిని ఆకర్షించడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవలే ఒక అభిమాని పట్టుకున్న ప్లకార్డు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆస్ట్రేలియా భారత్ మధ్య నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా ఇది జరిగింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక ప్రేక్షకుడు నా భార్య కంటే విరాట్ కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తా అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. ఇక ఈ ఫోటో వైరల్ గా మారిపోవడంతో.. ఇది చూసిన నెటిజన్స్ పక్కనే నీ భార్యను పెట్టుకుని.. ఇంత ధైర్యం చేస్తావా ఇంటికి వెళ్లాక నీకు ఉంటుంది అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి