అయితే వీరిద్దరూ ప్రతి మ్యాచ్ లో కూడా పరుగులు చేస్తున్నారు. ఇక ఆరెంజ్ క్యాప్ రేస్ లో కూడా ఈ ఇద్దరు పేరు మొదటి వరుసలోనే ఉంది. అయితే పరుగులు అయితే చేస్తున్నారు కానీ ఇక ఆ పరుగులు చేయడానికి ఎక్కువ బంతులను తినేస్తున్నారు. టీ20 తరహాలో అటాకింగ్ బ్యాటింగ్ కాకుండా వన్డే టెస్ట్ ఫార్మాట్ తరహాలో ఎంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఇక వీరి కారణంగా ఎక్కువ బంతులు వృధా అవుతూ ఇక మిగతా ప్లేయర్లకు ఆడేందుకు అవకాశం రావట్లేదు. ఇద్దరు జిడ్డు బ్యాటింగ్ చేస్తున్నారంటు విమర్శలు కూడా వస్తున్నాయి.
అయితే ఇలా ఐపిఎల్ లో డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ ఫాస్ట్ గా ఆడక పోవడంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోల్కతా వికెట్లు కోల్పోయిన సమయంలో ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఆడిన తీరును ప్రశంసించాడు హర్భజన్ సింగ్. ఒకవైపు వికెట్లు పడుతున్న 200 స్ట్రైక్ రేట్ తో వెంకటేష్ అయ్యర్ ఆడాడు అంటూ గుర్తు చేశాడు. సీనియర్లు అయిన డేవిడ్ వార్నర్, రాహుల్ లు అతన్ని చూసి నేర్చుకోవాలి అంటూ సలహా ఇచ్చాడు హర్భజన్ సింగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి