ఇక మరి కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్లో గాయపడి ఇక కొన్ని నెలలపాటు జట్టుకు దూరమయ్యారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి కీలక ప్లేయర్లు ఇక జట్టుకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. అయితే ఇలా టీమ్ ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయాలను బారిన పడుతూ జట్టుకు దూరం అవ్వడానికి కారణం కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ లు లేనప్పుడు విశ్రాంతి దొరికిన సమయంలో ఇక ఐపీఎల్ నిర్వసిస్తున్నారని.. ఆ సమయంలో ఇక క్రికెటర్లు విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ ఆడటం వల్ల గాయాల బెడద ఎక్కువవుతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇప్పటికే ఐపీఎల్ గురించి పలుమార్లు విమర్శలు గుప్పించిన భారత లెజెండరి క్రికెటర్ కపిల్ దేవ్ ఇటీవల మరోసారి ఇదే విషయంపై స్పందించాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలో ఆటగాళ్ల కెరీర్ నాశనం చేసే అవకాశం ఉంది అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. గాయాలు ఉన్న ఐపిఎల్ ఆడుతున్నారని.. కానీ టీమిండియా కు ఆడటం లేదు అంటూ ఎద్దేవా చేశారు. వరల్డ్ కప్ సమీపిస్తున్న ఇంతవరకు బుమ్రా భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడంపై బీసీసీఐని ప్రశ్నించారు. బుమ్రా, పంత్ లాంటి ప్లేయర్లు ఉంటే టీమిండియా పటిష్టంగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి