సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ పెర్సొనాలిటీస్ స్టోరీలను ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు మన దర్శకులు. ధోని, సచిన్, ఝులన్ గోస్వామి, ఇలా అనేక మంది క్రికెటర్ల కథలను ఇప్పటికే చిత్రాలుగా మలచి మనకు అందించారు. ఇప్పుడు తాజాగా మరో క్రికెటింగ్ లెజెండ్ కథ మన ముందుకు సినిమా రూపంలో రాబోతోంది. ఐతే ఈ చిత్రం కాస్త ప్రత్యేకం. కారణం ఈ లెజెండ్ మన దేశస్థుడు కాదు. మరి ఎవరు ఈ లెజెండ్ అని ఆలోచిస్తున్నారా? ఐతే ఇది చూడండి.

తమిళ దర్శకుడు ఎం ఎస్ శ్రీపతి శ్రీ లంక క్రికెటింగ్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ కథను సినిమాగా తీస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్గా మురళీధరన్ రికార్డు సృష్టించాడు. సుమారు 30 సంవత్సరాలపాటు శ్రీ లంక తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన మురళి, 495 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి, 1347 వికెట్లు పడగొట్టాడు. ఐతే ఈ అద్భుతమైన క్రికెటర్, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన "800" చిత్రం అక్టోబర్ 6 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మురళీధరన్, తన కెరీర్ లో తానూ పేస్ చేసిన ప్లేయర్ల గురించి మాట్లాడారు.

తన కెరీర్ లో పేస్ చేసిన కఠినమైన బ్యాట్స్మన్ ఎవరు అని ప్రశ్నించగా మురళీధరన్ ఎవ్వరు ఊహించని సమాధానం ఇచ్చాడు. తన కెరీర్ లో సచిన్, గంగూలీ, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా వంటి దిగ్గజ ప్లేయర్లకు బౌలింగ్ చేసాడు మురళి. కానీ అందరికంటే అతన్ని ఎక్కువగా భయపెట్టిన బ్యాట్స్మన్ మాత్రం మన వీరేంద్ర సెహ్వాగ్ అట. దీనికి కారణం సెహ్వాగ్  అవుట్ అవ్వడం గురించి పట్టించుకునేవారు కాదట. అసలు తన వికెట్ కు విలువ ఇచ్చేవాడు కాదట. ఆటను చాలా ప్రశాంతంగా, ఎంజాయ్ చేస్తూ ఆడేవాడట. "సెహ్వాగ్ పాట పాడటం మొదలుపెడితే అతన్ని అవుట్ చెయ్యడం చాలా కష్టం" అంటూ చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ క్రికెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: